రెహమాన్ పాటతో గుండె వంద మైళ్ళ వేగం తో కొట్టుకుంటోంది
రక్తం ఇంధనం లా కరిగి కొవ్వు బొగ్గులా మరిగి
వళ్ళంతా అగ్గి చెలరేగి ఆవిరి పుట్టి
స్వేదం ఏరులై పారుతోంది
నా వల్ల కాదంటోంది శరీరం
నే తట్టు కోలేనంటూంది గుండె
ఇంకొక్క అడుగు ..ఇంకొక్క అడుగు.. అంటోంది మెదడు
శక్తినంతా కూడా తెచ్చుకుని పరిగెడుతున్నా .. పరిగెడుతున్నా
ఉచ్వాస నిశ్వాసాలు వేడి ఆవిరులు యెగజిమ్ము తున్నాయ్
పిక్క కండరాలు చీలి పోతునట్టున్నాయ్
కాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాయి
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్
వళ్ళు అదుపు తప్పుతోంది .
ఉహ్ ఉహ్ ..
.తొంబై .....
ఉహ్ ఉహ్
.తొంబై అయిదు
ఉహ్ద ఉహ్ ఉహ్ ఉహ్
ఉహ్ ..ఒ ఉహ్ కటి
ఒక్క మైలు ..ఒక్క మైలు ..
అదీ సంగతి ...
ఒక్క మైలు పరిగెత్తడానికి నే పడ్డ పాట్లు
కాబట్టి నే చెప్పోచ్చేదంటంటే..
చెంచాడు నెయ్యి వేసుకునేముందు .. మైలు పరిగెత్తగలనా అని ఆలోచించుకోవాలి