ఏంటి బా అలగున్నావ్ ? ఎవడు సినిమా కానీ సూసేసినా వేటి
అదేం లేదు బా. వార్తలు సూస్తే సీకాకుగుంది
ఓసోస్ ఇప్పుడు ఏటై పోనాది
జె పీ కూడా ఇలగ మాట మార్సేసినాడేటి బా . ఎలచ్చన్లు వచ్చే సరికి ఎవరైనా ఇంతేనా బా.
ఎలచ్చన్లు పక్కకి పెట్టేస్. ఇప్పుడు ఏం మాట మార్సేసాడు జె పి
అదేంటి బా అలగంటావ్. తెలంగాణా ఇచ్చేయ్ మన్నాడు కదేస్
అదా.. ఇప్పుడు కొత్తగా సెప్పే దేటి ఎప్పుడూ అదే చెప్తున్నాడు కదరా
ఎప్పుడు చెప్పాడు బా
ఆరేళ్ళ గా చెబుతున్నాడు గా యిభజనతో సమస్యలు అన్నీ తీరిపోవు. ఇభజన సేసినా వచ్చేది లేదు సెయకపొయినా పొయ్యేది లేదు అని
అవును. మరి ఇప్పుడు సెయ్యమని ఎందుకు సెప్పాడు
ఇంకెన్నాళ్ళు రా ఇలా. ఇప్పటికే ఎంత నట్టం జరిగింది. మన లాటోళ్ళకి పనులు ఉండట్లేదు సరిగ్గా. ధరలు పెరిగిపోతున్నాయి. ఇల్లు గడవట్లేదు. బయట గొడవలు ఎక్కువై పోతున్నాయి. అంతెందుకు రా మా ఇంటి పక్కన మల్లేస్ స్నేహంగా ఉండేవాడు. ఈ గొడవలు మొదలయ్యాకా మాటల్లేవు.ఇడిపోవాలని ఇంత ఇదిగా అన్ని చోట్లా వచ్చాకా ఎంత తొరగా ఇడిపోతే అంత మంచిది. బలవంతంగా ఉంచితే ఎవరూ సుఖంగా ఉండలేరు, పోరు పెద్దదవుతాది. పేమ సిన్నదవుతాది. అందుకని తొరగా ఇది తేల్చ మన్నాడు జె పి. ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఏమీ జరగనట్టు ఉండద్దు అన్నాడు.
అయినా ...
హ్మ్ .. పోనీ నీ రూట లోనే ఆలోసిద్దామ్. ఈయన సెప్ప లేదు అనుకుందాం. సొనియమ్మ యిభజన సేయ కుండా వదిలేత్తుందా.
మానదనుకో
పోనీ సొనియమ్మ , కాంగ్రెసు ఇచ్చే లోపే ఈ యెలచ్చన్లో ఓడి పోయిందనుకో వచ్చే బి జె పి నో, మోడీ నో తెలంగాణా ఇవ్వకుండా ఉంటాడా
అవుననుకో
పోనీ ఇప్పుడు కొంపలు ముంచేసాడని గగ్గోలు ఎట్టేత్తున్ననాయకులు ఆపడానికి ఏం సేశారు. పోనీ వీళ్ళకి ఆపే సత్తా ఉందా. హమ్మయ్య ఇంకో రోజు దాటెయ్యచ్చు అని నాన్చడం తప్ప ఒక్క కొలిక్కి తెచ్చారా అయిదేళ్ళు గా.
అవును బా
ఇప్పుడు ఈయన సెప్పిందేటి? ఇచ్చేది ఎలాగు ఇత్తున్నారు గా. ఇచ్చేదేదో సక్కగా పద్దతిగా ఇమ్మని కదా. రాయలసీమ వాళ్ళకి పన్ను ఉండకపోతే అదేదో స్పెసల్ టేటస్ యిత్తే బోలెడు పెట్టుబడి పెట్టి యాపారాలు పెడతారు. కరువు తీరిపోద్ది. కోస్తాకి పోలవరం ప్రాజెక్టు, రామయపట్నం పోర్టు, సదుకోడానికి మంచి కాలేజీలు. ఇక తెలంగాణా కి హైదరాబాదు ఎలాగో ఉంది కదా.
బావుంది బా. కానీ ఇవన్నీ ఎప్పటికి వచ్చేను ? వాళ్ళు ఇచ్చేనా చచ్చేనా
అది కాదు రా. ఇప్పుడు తెలంగాణా కి ఒప్పుకుంటే ఇవి అడగడానికి ఈలు ఉంటాది. ఇప్పుడు తెలంగాణా
వల్ల కాదు అని మొండికేసుకుని కూకుంటే వాళ్ళు మొండికేసి ఇభజన సేసేత్తే . ఏంటి పరిత్తితి ?
ఇప్పుడు కాకపోతే ఇంకో మూడేళ్ళ లో లేక అయిదేళ్ళలో లేక పదేళ్ళలో ఇభజన అయిందనుకో. అప్పుడు ఇంకా నట్టమే కదా .. అదేదో ఇప్పుడే అయితే ఈ లోపు వేరేవి ఒకటో రెండో పతనాలు బాగు పడతాయి కదా.
అదీ కాక ఈ గొడవలు తగ్గడం వల్ల ఇంకొన్ని ఊర్లు , మూడు ప్రాంతాలూ బాగు పడతాయేమో?
అలగయితే బా , మీ సావు మీరు సావండి . నేనిచ్చి తీరుతా అన్న సొనియమ్మని, మీరు కాకపోతే నేనిస్తా అన్న మోడీ ని, ఒక గడియ "అయితే ఓకే" , ఒక గడియ "నేనొప్పుకోను" అనే బాబుని, యిభజిస్తే సి ఎమ్ అయిపోదామనే ఓదార్పన్నని వదిలేసి జె పి మీద పడ్డారేటి బా అందరూ
అదేరా మరి . మెత్తగా ఉంటే మొత్త బుద్ది అని