మొన్నోరోజు మా బంధువులు కౌముది లో నా కథ చదివాం అని చెప్పారు. అప్పటి దాకా నాకు ఆ కథను కౌముది వారు ప్రచురించారని తెలియదు. వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటి లో బహుమతి పొందిన కథలు కౌముది లో వేస్తారని విన్నాను కానీ నా కథ గత సంచికలో రాకపోయేసరికి ప్రసంశా పత్రం వచ్చినవి వెయ్యరేమో అని సరిపెట్టుకున్నాను.
నేను రాసిన మొదటి కథకి (రాసినప్పుడు కథో కాదో కూడా నాకు తెలియదు) గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ఇంకా రాయాలని ఊపొచ్చింది.
ఈ కథని కౌముది ఆగస్టు సంచికలో చదవచ్చు.
అన్నట్టు నా బ్లాగ్ లోని భోగి పిడక కథే ఇది. ముగింపు మార్చి పోటీకి పంపాను.
ఏది బావుందో చెప్పాలి మరి మీరు.
మనలోమన మాట. ఏదీ బావోకపోయినా చెప్పండి. మరేం పర్లేదు.
.