Thursday, August 19, 2010

కౌముది లో నా కథ

                          

              మొన్నోరోజు మా బంధువులు  కౌముది లో నా కథ చదివాం అని చెప్పారు. అప్పటి దాకా నాకు ఆ కథను కౌముది వారు ప్రచురించారని తెలియదు. వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటి లో బహుమతి పొందిన కథలు కౌముది లో వేస్తారని విన్నాను కానీ నా కథ  గత  సంచికలో రాకపోయేసరికి ప్రసంశా పత్రం వచ్చినవి వెయ్యరేమో అని సరిపెట్టుకున్నాను.

నేను  రాసిన  మొదటి కథకి (రాసినప్పుడు కథో కాదో కూడా నాకు తెలియదు)  గుర్తింపు రావడం ఆనందంగా  ఉంది. ఇంకా రాయాలని ఊపొచ్చింది.

ఈ కథని కౌముది ఆగస్టు సంచికలో  చదవచ్చు.

అన్నట్టు నా బ్లాగ్ లోని భోగి పిడక కథే ఇది.  ముగింపు మార్చి  పోటీకి పంపాను.

ఏది బావుందో చెప్పాలి మరి మీరు.

మనలోమన మాట. ఏదీ బావోకపోయినా చెప్పండి. మరేం  పర్లేదు.

.

4 comments:

  1. అభినందనలు వాసుగారూ.. మీ నుంచి మరిన్ని మంచి కథల కోసం ఎదురు చూస్తున్నాం..

    ReplyDelete
  2. థాంక్స్ మురళి గారు. ప్రయత్నిస్తాను రాయడానికి.

    ReplyDelete
  3. అభినందనలు వాసు గారు :-) మీకు చెప్పే ప్రచురించి ఉంటారు అనుకున్నాను. నేను సంచిక రాగానే చదివి అనుకన్నాను మన వాసుగారే అని :)

    ReplyDelete
  4. థాంక్స్ వేణు గారు. చదివేశారు అన్నమాట. కొన్ని ముద్రా రాక్షసాలు ఉంటే అవి సరి చేయించి చెప్పే లోపు చాలా అలస్యమైపాయింది.

    కౌముది వారు ప్రత్యేకించి మళ్ళీ చెప్పరేమో. ఇలా చూడడం.. అదో తుత్తి.

    ReplyDelete