Thursday, August 11, 2011

మా తెలుగు తల్లికి


నిన్న ఉదయం లీడర్ లో మా తెలుగు తల్లికి పాత వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ (వివేక్ మోడల్) లో రోజూ ఆ గీతం తోనే అసెంబ్లీ మొదలయ్యేది.
పాత వింటూంటే  ఒక గర్వం (అప్పుడు అదని తెలియదు ), ఆనందం, తెలియని శక్తి వచ్చినట్టుండేది.  అదేం కర్మో మా స్కూల్లో తెలుగు లో మాట్లాడితే తప్పనేవారు, తన్నేవారు (అయినా తెలుగు లో మాట్లాడుతూనే ఉండే  వాళ్ళం అది వేరే విషయం.  ).  అలా తెలుగు మాటలాడ నివ్వకపోవడం  తప్పని అనిపించేది కాదు అదేంటో .

ఇప్పుడు ఎంచక్కా గొడవ లేదు, సగం స్కూళ్ళలో తెలుగే ఉండట్లేదు తప్పనిపించడానికి.  పోనీ బయట జనాలు మాట్లాడే దాంట్లో బూతద్దం వేసి తెలుగు పదాలు వెదకాలి. మాల్, రెస్టారంట్, ఎయిర్ పోర్ట్, మల్టీ ప్లెక్స్  ఎక్కడికెళ్ళినా తెలుగు మాట్లాడడం నేనైతే చూడలేదు. స్వయం వరం సినిమాలోలా "తెలుగులో మాట్లాడుకుందాం. సుఖంగా ఉంటుంది"  అని ఎందుకు అనలేము?

ఇక్కడ అయితే తెలుగు మిత్రులతో మాట్లాడినపుడు ఒక్కోసారి తెలుగు పదం తట్టినా
ఆంగ్ల పదమే వాడడం పరిపాటి. ఈ తెగులు నాకు కూడా ఉండేది. ఇప్పుడు ఇంచు మించు వదిలింది.
కానీ అక్కడ కంటే నా తెలుగు ఇక్కడే బాగు పడింది. బోలెడు పుస్తకాలు, రచయితలూ, బ్లాగులు, బ్లాగరులు, బజ్జరులు (:))  పరిచయమయ్యారు.  రోజుకి రెండు మూడు  గంటలన్నా తెలుగు చదివేలా చేస్తున్నారు.

ఇక్కడి జనాల ఆసక్రి చూస్తే తెలుగు భాష అంతరించిపోతుందనే భయం ఏం లేదు అనిపిస్తుంది. శంకర శాస్త్రి గారు చెప్పినది తెలుగుకు చక్కగా అన్వయించుకోవచ్చు.
"తెలుగును పట్టించుకోడానికి నూటికి ఒక్క వ్యక్తీ ఉన్నా ..ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది"
 
ఏమంటారు ??


5 comments:

  1. తెలుగు ని నేర్చుకోవడానికి.. పిల్లలు బాగానే ఇష్టపడతారని.. మా స్నేహితులు చెబుతూ ఉంటారండీ. వచ్చిన చిక్కు ఏమంటే ..పెద్దలకి..ఆసక్తి తగ్గడమే! పుస్తకాలు చదివినట్లు..బ్లాగ్ లు చదువుతున్నాం. బాగుంది కూడా...మీరు చెప్పడమూ బాగుంది..

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు వాసు గారు..

    ReplyDelete
  3. ఇప్పుడు ఎంచక్కా గొడవ లేదు, సగం స్కూళ్ళలో తెలుగే ఉండట్లేదు తప్పనిపించడానికి. నిజం కదా!! చివరి వాక్యం బాగుందండీ..

    ReplyDelete
  4. వనమాలి గారు: అది నిజమే. కొంత మంది (మీరు చెప్పిన కోవకి చెందినా వారు) తెలుగు తప్ప ఏ బాషయినా హాయిగా మాట్లాడతారు. తెలుగలో మాటాడడం నామోషి.
    థాంక్స్

    థాంక్స్ మురళి గారు

    థాంక్స్ వేణు గారు

    ReplyDelete
  5. మీరు చెప్పడం బాగుంది

    ReplyDelete