Tuesday, July 3, 2007

ప్రకృతి - వికృతి

- వాసు

పచ్చని ఆకులు గాలికి ఊగే
వెచ్చని ఊహలు నా మది రేగే
కమ్మని స్వరమేదో యెద తొలిచే
రమ్మని ఆమని మది పిలిచే
ఝుమ్మని తుమ్మెద పూయెద వాలె
కమ్మని తేనెలు గ్రోలె

రివ్వున పక్షుల గుంపులు పసిడి మబ్బుల తేలుతూ
దూరాన ఎర్రని రవిని తాకాలని పరుగులు తీసె
ఎరుపెక్కిన గగనాన చిక్కటి చీకటి పొరలు
చక్కని చుక్కలనద్దుకుని చంద్రుడి చెవి పట్టుకుని
సంధ్యా కాంతుల వెనువెంట ఉరకలు
వేసె

పురివిప్పిన ఈ ప్రకృతి సుందర ఆకృతి పట్టని పట్టణ వాసులు
వికృత జీవన గతికి అలవడిన కాసుల దాసులు
విద్య జనించు సంపదకో, సంపద జనించు విద్యకో నిరంతరం శ్రమించు యంత్రాలు
విధాత కుంచె రంగుల హంగులను అంగుళం కూడా ఆస్వాదించలేని అభాగ్యులు

Click here to see in telugupeople.com

Neeku Kashtam vaste


Click here to see

ఆ గదిలో (Aa Gadiloa)


తలుపుకి అవతల ..
చీకటి కటిక కాటుక కాయంతో బయటకి వచ్చిన కాన్తినల్లా మింగేస్తోంది
ఐనా తీరని ఆకలితో కేకలేస్తోంది
రాకాసిలా నాకేసి చూస్తోంది

ఇవతల ..
దీపం శ్వేతకాంతులు చిమ్ముతూ చీకటిని వెక్కిరిస్తోంది
పాపం శీతల గాలి వీచి వీచి శ్రమించి శక్తి నశించి స్తంభించింది

అరలో పుస్తకాలు చలికి తాళలేక ఒరులను హత్తుకున్నాయి
కుర్చీలు బరువును మోసి మోసి అలసి సొలసిన కాయం తో విశ్రమిస్తున్నాయి
బట్టలు గాలి లేని బుడగల్లా వేలాడుతున్నాయి
కిటికీలు పళ్ళు బిగించి కళ్ళు సాచి గాలి కూడా చొరబడకుండా కాపలా కాస్తున్నాయి

ఆ గదిలోనే ..

గోడకొకటి బల్లిలా అతుక్కుని
రెండు ముళ్ళని తొడుక్కుని
గుండ్రటి గిరి గీసుకుని
రేయింబగళ్ళు శ్రమిస్తోంది
శ్రమే ఊపిరిగా జీవిస్తోంది
నా విశ్రాంతిని ప్రశ్నిస్తోంది
శ్రమ శక్తిని ఘోషిస్తోంది.





Click here to see this post in Telugupeople.com

వీసా - ఆశ

- వాసు

గురుడు వక్రంగా చూస్తున్నాడు నన్ను
దేవుడు మాధవుడై కరుణిస్తాడో వామనుడై బలి చేస్తాడో బయపడుతూ నేను
చెన్నై గుండెల్లో నిద్ర పోతున్న కాన్సులేట్ ముందు నీరెండ లో నేను
ఆ దేశానికి వెల్లడానికి ఆదేశానికి నా అర్హతల బొచ్చె తో బిచ్చగాడిలా నేను

ఇక్కద అన్నటికంటే ఉండాల్సినది (నాకు లేనిది) అదృష్టం
లేక పోతే చాలా కష్టం
ఇది సుస్పష్టం

తెల్లవాళ్ళని కూడా మన వాళ్ళు మార్చేశారు
అందుకే కాబోలు గంట ఆలస్యంగా లోపలికి పిలిచారు
నా అర్జీ పత్రాలను ఇచ్చి దర్జాగ కూర్చున్నా
అవన్ని సద్ది ఇచ్చిన పచ్చ కవరు తీసుకున్నా
నా జుత్తన వేళ్ళకైవేచి ఉన్న వాళ్ళకి ముద్రలిచ్చి అంతిమ ఘట్టానికి చేరుకున్నా

ఇకనో ఇప్ప్పుడో పని అయిపోతుందని తలపు
వెంటనే మూసుకునేది కౌంటర్ తలుపు
ముందు మూడు తరువాత ఏడు
ఆరు రెండు తొమ్మిది ఐదు
ఎన్ని మారిన ప్రయోజనం లేదు
ఒక్కటీ నన్ను కరుణించ లేదు
ఒక పక్క భయం
మరో పక్క గడుస్తున్న సమయం
అంతా అయోమయం

కౌంటర్ మూడు కు చేరి మూడీ గా కూర్చున్నా
పిలవగానె పరుగున వెళ్ళి నిల్చున్నా
ఉదయం నుంది నాకేసి చూసే రాకాసుల కన్నా
వీడు పర్లేదు వీసా కి అవకాశాలు మిన్న
ఎదేదో చెప్పాలనుకున్నా అసలు అడిగితే కదా
పోన్లే ఇచ్చేస్తాడనుకున్నా వినకుండా నా కథ

అన్నీ చూసి ఆ తెల్ల కుర్రాడు
చావు కబురు చల్లగా చెప్పాడు
ప్రస్తుతానికి వెళ్ళి రమ్మన్నాడు
వచ్చేటప్పుడు కొన్ని కాగితాలు, కూడా తెమ్మన్నాడు

వీసా మాట దెవుడెరుగు గుందె తేలిక పడింది
చిలుకూరు ప్రదక్షిణం, అమెరికా ప్రయాణం వాయిదా పడింది