Tuesday, July 3, 2007

ఆ గదిలో (Aa Gadiloa)


తలుపుకి అవతల ..
చీకటి కటిక కాటుక కాయంతో బయటకి వచ్చిన కాన్తినల్లా మింగేస్తోంది
ఐనా తీరని ఆకలితో కేకలేస్తోంది
రాకాసిలా నాకేసి చూస్తోంది

ఇవతల ..
దీపం శ్వేతకాంతులు చిమ్ముతూ చీకటిని వెక్కిరిస్తోంది
పాపం శీతల గాలి వీచి వీచి శ్రమించి శక్తి నశించి స్తంభించింది

అరలో పుస్తకాలు చలికి తాళలేక ఒరులను హత్తుకున్నాయి
కుర్చీలు బరువును మోసి మోసి అలసి సొలసిన కాయం తో విశ్రమిస్తున్నాయి
బట్టలు గాలి లేని బుడగల్లా వేలాడుతున్నాయి
కిటికీలు పళ్ళు బిగించి కళ్ళు సాచి గాలి కూడా చొరబడకుండా కాపలా కాస్తున్నాయి

ఆ గదిలోనే ..

గోడకొకటి బల్లిలా అతుక్కుని
రెండు ముళ్ళని తొడుక్కుని
గుండ్రటి గిరి గీసుకుని
రేయింబగళ్ళు శ్రమిస్తోంది
శ్రమే ఊపిరిగా జీవిస్తోంది
నా విశ్రాంతిని ప్రశ్నిస్తోంది
శ్రమ శక్తిని ఘోషిస్తోంది.





Click here to see this post in Telugupeople.com

No comments:

Post a Comment