Tuesday, July 3, 2007

ప్రకృతి - వికృతి

- వాసు

పచ్చని ఆకులు గాలికి ఊగే
వెచ్చని ఊహలు నా మది రేగే
కమ్మని స్వరమేదో యెద తొలిచే
రమ్మని ఆమని మది పిలిచే
ఝుమ్మని తుమ్మెద పూయెద వాలె
కమ్మని తేనెలు గ్రోలె

రివ్వున పక్షుల గుంపులు పసిడి మబ్బుల తేలుతూ
దూరాన ఎర్రని రవిని తాకాలని పరుగులు తీసె
ఎరుపెక్కిన గగనాన చిక్కటి చీకటి పొరలు
చక్కని చుక్కలనద్దుకుని చంద్రుడి చెవి పట్టుకుని
సంధ్యా కాంతుల వెనువెంట ఉరకలు
వేసె

పురివిప్పిన ఈ ప్రకృతి సుందర ఆకృతి పట్టని పట్టణ వాసులు
వికృత జీవన గతికి అలవడిన కాసుల దాసులు
విద్య జనించు సంపదకో, సంపద జనించు విద్యకో నిరంతరం శ్రమించు యంత్రాలు
విధాత కుంచె రంగుల హంగులను అంగుళం కూడా ఆస్వాదించలేని అభాగ్యులు

Click here to see in telugupeople.com

No comments:

Post a Comment