Monday, November 2, 2009

ఇవీ సంగతులు - నవంబర్ 2కార్తీక మాసం అనగానే తెలియని ఆనందం కలుగుతుంది నాకు . ఇండియా లో ఉంటే ఈ మాసం లో ప్రతీ సోమవారం ఉదయాన అభిషేకం, ఉపవాసం భలే ఉండేది. నాకు కార్తీక మాసం మొత్తం పండగ లా అనిపించేది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, సాయంత్రం వరకు వేచి వేచి తినడం భలే ఆనందం గా ఉండేది. (అన్నట్టు ఉపవాసం అంటే దగ్గరగా (ఉప ) ఉండటం (వాసం) దేవుడికి దగ్గరా ఉండటంట). అందులో కార్తీక మాసం లో ఉదయాన చలి ఎక్కువగా ఉంటుందేమో, ఆ చలిలో తెల్లవారకుండా తల స్నానం, సూర్యుడి తొలి కిరణాలు కూడా రాకుండా గుడి వరకు నడక, గుడిలో అభిషేకం, అది అయ్యాక అప్పుడప్పుడే వస్తున్నా వెచ్చని కిరణాల వేడికి చలి కాచుకుంటూ ఇంటికి రావడం, శివ స్తుతి వినడం, సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం పూజ చేసి, చంద్రుణ్ణి , నక్షత్రాలని చూసి, వేడి వేడి పులిహోర, కంద బచ్చలి కూర (నాకు ఇదంటే ప్రాణం) తినడం - ఒక చక్కని అనుభూతి. దీంట్లో ఏది తక్కువైనా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించేది (ముఖ్యంగా కందా బచ్చలి :) ). ఇక్కడికొచ్చాక ఉపవాసం ఐతే కుదురుతోంది కాని, మిగతావన్నీ కష్టమే. అయినా వీలున్నంత లో చేసి మమ అనిపిస్తున్నాం. ఇక ఇవి కాకుండా, వన భోజనాలు. ఈ సారి కనీసం దీనికైనా ప్లాన్ చెయ్యాలి మేము.  

మధ్య టివి పెడితే (తెలుగు చానళ్ళు ) తెగ చిరాకోస్తోంది. ఒకటి రెండు మినహా అన్ని కార్యక్రమాలు కాంపిటీషన్ - ఎలిమినషన్ - డేంజర్ జోన్ లేదా డబ్బు- సినిమాలు. నిన్న యు ట్యూబ్ లో మాల్గుడి డేస్ కంట పడింది. అది చూస్తే చిన్నప్పుడే, ఒక్క డి డి ఉన్నప్పుడే ఎంత మెరుగ్గా ఉన్నాయి కార్యక్రమాలు అనిపించింది. దానికి తొడు నిన్న నాకు తెలిసిన ఓ బ్లాగ్ లో వీటి గురించి చదువుతుంటే చిన్నప్పటి వన్నీ మరీ ఎక్కువగా గుర్తొచ్చి నెమరు వేసుకుంటున్నాను. వారాంతం లో వచ్చే సినిమా కోసం వేచి చూడడం, శుక్రవారం ఐతే చిత్రలహరి, బుధవారం చిత్రహార్, ఆది వారం రంగోలి. ఇంకా సురభి, ఉడాన్, తెహ్కికాత్, గుల్ గుల్షన్ గుల్ఫా, చాణక్య, మహాభారత్, రామాయణ్ ఇలా బోలెడు, అన్ని చూసి ఆనందించగలిగేవే. ఆఖరికి మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చాలా చక్కగా ఉండేవి . ముఖ్యంగా ఏక్ తిత్లీ, మిలే సుర్ మేరా ఇప్పుడు చూసినా ఎంత బావున్నాయో అనిపిస్తాయ్.పుట్ట గొడుగుల్లా వస్తున్నా చానల్స్, హాయిగా చూడగల కార్యక్రమాలు అసల లేవనిపిస్తుంది. ఉప్పెక్కువై రుచి చెడినట్టు, చానల్స్ ఎక్కువై నాణ్యత పోయింది.

నిన్న మై కజిన్ విన్నీ అనే ఒక సినిమా చూసాను. పేరు కూడా వినలేదు ఇంతకూ ముందెప్పుడూ నేను. మిత్రుడొకడు మరీ మరీ చెప్తే చూసాను. భలే ఉంది. ఆద్యంతమూ హాస్యం, అలా అని కథ, కథనం గాలికి వదిలెయ్యలేదు. చిన్న కథ, ఆసక్తికరమైన కథనం. చిన్న దొంగతనం చేసిన ఇద్దరిని పొరపాటున హంతకులనుకుని అరెస్టు చేస్తారు. వాళ్ళలో ఒకడి కజిన్ (విన్నీ) ని అటార్నీ కింద పెట్టుకుంటారు. అతని చేష్టలు, జడ్జి కి అతనికి మధ్య కోర్టు సన్నివేశాలు, అతను పడే పాట్లు, చేసే ఫీట్లు - ప్రతీ సీన్ భలే నవ్వు తెప్పిస్తుంది . చివరికి కేసు ను వాదించడం కూడా చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు . కుదిరితే తప్పక చూడండి.తరువాత మీరే ఇది ఎలా మిస్ అయ్యానా అనుకుంటారు.
ప్రస్తుతానికి ఇంతే సంగతులు. మళ్ళీ కలుద్దాం.
P.S. ఈ టపాకి (ఇక పై ఈ బ్లాగ్ లో ఈ క్రమం లో, ఈ పేరుతొ వచ్చే టపాలకి) కొత్తపాళీ గారి కబుర్లు ప్రేరణ. ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.

14 comments:

 1. "మై కజిన్ విన్నీ"... ఒక రెండుమూడు నెలల క్రితం అనుకొకుండా చూసానీ సినిమాని..ఆతరువాత ఇంకొక మూడుసార్లు చూసా.. అంతగా నచ్చిందీ సినిమా..హీరో యాక్షను, దాని మించి ఆ హీరోయిన్ యాక్షను..మంచి కామెడీ.. ముఖ్యంగా బురదలో పడ్డాక ఒక డ్రస్సు వేసుకొని కోర్టు కొస్తాడు చూడండి ఆ సీను సూపర్బ్.. :)

  మీరు కార్తీక మాసం అనగానే మీకున్నలాంటి చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చాయి.. ఇంతకు మించి ఇంకేమీ రాయలేను..నీరసం.. కార్తీక పౌర్ణమి కదా ఉపవాసం అన్నమాట.. ఇంటికెళ్ళి ఎంతతొందరగా తినేద్దామా అని ఉంది.. :)

  ReplyDelete
 2. @ ఉమా శంకర్ గారూ: ఔనౌను. ఆ సీన్ భలే ఉంటుంది. అన్నట్టు మర్చిపోయా హీరోయిన్ కూడా భలే అందంగా ఉంటుంది.

  చాలా థాంక్స్ అండీ. అంత నీరసం లో కూడా కామెంటారు.

  ReplyDelete
 3. నేను చూసిన తొలి ఇంగ్లీషు కామెడీల్లో ఈ సినిమా ఒకటి. ఎక్కడా బోరు కొట్టించకుండా చాల సరదాగా ఉంటుంది.

  ReplyDelete
 4. జో పెస్చి .. మంచి ఎక్టర్.. గుడ్ ఫెల్లాస్ , కెసినొ లొ భయంకరమయిన విలన్.. సినిమాలొ ఎప్పుడు చూసిన కసక్ కసక్ లే..
  హొం ఎలొన్ , విన్ని లొ కామెడి.. రెజింగ్ బుల్ లొ హీరొ బ్రదర్ కెరెక్టర్ మంచి పాత్రలు..

  ReplyDelete
 5. @ వేమన - ఔను. ఎక్కడా బోర్ కొట్టదు.

  @ మంచు పల్లకి - మీరు చెప్పే వరకు ఇతను (జొ పెస్చి) గుడ్ ఫెల్లాస్ లో విలన్ (నిజానికి సైడ్ హీరో కూడా) అని గమనించలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. దాంట్లో తెగ కసక్ లు మీరన్నట్టు.

  ReplyDelete
 6. చిన్నప్పుడు కార్తీకమాస స్నానాలకి మావీధి మీదనే వెళ్ళేవారు.(ఇప్పటికీ కూడా)భజనలు చేసుకుంటూ..ఆ రోజుల్ని గుర్తుచేసారు.
  సినిమా తప్పకుండా చూస్తాను.

  ReplyDelete
 7. వాసుమహాప్రభో, ఈ నల్ల తెరమీద తెల్లక్షరాలు నా నాలుక్కళ్ళకీ బైర్లు కమ్ముతున్నాయి, కరుణించండి.
  పనిలో పనిగా వర్డ్ వెరిఫికేషను కూడా తొలగించండి.
  మైకజిన్ వినీ మంచి వినోదాత్మకమైన సినిమా. మరిస్సా తోమేకి ఇందులో నటనకిగాను సపోర్టింగ్ నటీమణి ఆస్కారు లభించింది.

  ReplyDelete
 8. కొత్తపాళీ గారూ - మీ మొర ఆలకించాను :). మీ అందరి వ్యాఖ్యల వాళ్ళ నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి మై కజిన్ విన్నీ గురించి. అవార్డు సంగతెలా ఉన్నా భలే అందంగా ఉంది అమ్మాయి మాత్రం.

  ReplyDelete
 9. అవును మరి. అన్నిటి కన్నా కబుర్లే బావుంటాయి. 'మై కజిన్ విన్నీ' ఈ మధ్యే ఇక్కడ స్టార్ మూవీస్ లో వచ్చింది. చాలా బావుంది. మీరు వంశీ గారి 'చెట్టు కింద ప్లీడర్ ' చూశారా ? రెంటికీ పొంతన ఏమిటి అని కాదు.. ఈ సినిమా కూడా బావుంటుంది. ఇంకో ఊరించే విషయం.. కార్తీక మాసం లో పౌర్ణమి నాడు సముద్రం లో (లేదా ఎక్కడన్నా లేక్ లో) చంద్రుని బింబాన్ని చూసారా ? ఈ మధ్య తెలుగు లో 'మా నాన్న చిరంజీవి ' అని, జగపతిబాబు గారి సినిమా ఒకటి వస్తూంది. పత్రికల లో ఫోటో లు చూస్తుంటే, అది 'ద పర్స్యూట్ ఆఫ్ హాపీనెస్' కి కాపీ ఏమో అని అనిపిస్తూంది ! కబుర్లంటే - ఇవే ! మీరు కొన్ని చెప్తారు, మేము కొన్ని చెప్తాం. కొన్ని సార్లు అంతే వుండదు.

  అన్నట్టు మీ బ్లాగు పేరు బావుంది. అంటే అర్ధం ఏమిటో మాత్రం తెలియదు. మానస సంచరరే అని ప్రముఖ కీర్తన ఉంది.. వినాలంటే నా బ్లాగు లో గానీ, ఈస్నిప్స్ లో గానీ ప్రయత్నించొచ్చు. (ఉచిత సలహా!!! మీక్కాబట్టి ఫ్రీ !)

  ReplyDelete
 10. ఈ సినిమాని సునిల్ హీరోగా పెట్టి తెలుగులో లాగించెయ్యొచ్చు.

  ReplyDelete
 11. ద పర్స్యూట్ ఆఫ్ హాపీనెస్ తెలుగు లొ తీస్తే బాగానే వుంటుంది ...పాటలు లేకుండా తియ్యగలిగితే.. :-)

  ReplyDelete
 12. @ సునీత గారు - థాంక్స్

  @ సుజాత గారు - నా శ్రీమతి కూడా సరిగ్గా అదే మాట అంది మొదటి అరగంట చూసి, చెట్టు కింద ప్లీడర్ కి దీని ప్రేరణ ఉందేమో అని కానీ అది ఇంకా ముందు వచ్చినట్టు గుర్తు.
  అయ్యో మిస్ అయిపోయాను చూడలేదు చంద్ర బింబాన్ని. నాకు ప్రేమ దేశం లో వెన్నెల వెన్నెలా పాటలో చూపించినట్టు పున్నమి వెన్నలలో మంచి సంగీతం వింటూ సాగర తీరం లో కూర్చోవాలని కోరిక ఎప్పటికి తీరుతుందో. ఇక్కడ మరీ చల్లగా ఉంటాయి బీచెస్. రాత్రి ఉండటం అంటే ఇంచు మించు అసాధ్యం.
  ది పుర్సూట్ అఫ్ హ్యాపీనెస్ (విత్ ఎ 'y') మా నాన్నకు చిరంజీవి అంటారా. ఏమో ట్రైలర్ చూస్తే హాయిగా పాటలు పాడుకుంటున్నారు. ఆ చిత్రం లో కనీసం 10 నిమిషాలు కూడా ఆనందంగా ఉండరు, ఎప్పుడూ ఏదో కష్టం కదా. దాని వల్లే చివర్లో ఆ ఎఫ్ఫెక్ట్ వచ్చిందని నా ఫీలింగ్.

  ఇక నా బ్లాగ్ పేరంటారా. మానస సంచరరే పాట నాకు కూడా చాలా ఇష్టం (శంకరా భరణం ద్వారా). నేను అర్థం తెలుస్కోలేదు కాని ఆ కీర్తనకి. మానస సంచర అంటే మనస్సున చరించేది, తిరిగేది(/తిరిగేవి) అంటే ఆలోచనలకి దగ్గరా ఉందని అప్పుడెప్పుడో అనుకున్నా. ఒక చిన్న డైరీ లో ఇలాటివి రాసుకునేవాడిని, దానికి ఈ పేరు పెట్టుకున్నా. బ్లాగ్ మొదలెట్టినప్పుడు అదే పెట్టేసా.

  @ కత్తి మహేష్ గారూ - తెలుగులో కథ లో మార్పులు పెద్దగా లేకుండా తీస్తే బానే ఉంటుంది. కామెడి దీంట్లో ఒక 50% సాధించగలిగినా చాలు.

  @ మంచు పల్లకి - తెలుగులో తియచ్చు. The shawshank redemption కూడా తియ్యచ్చు. :):):):):)

  ReplyDelete
 13. కంటెంట్ చాల బావుంది , నిజంగా మన న చిన్నతనం లో లైఫ్ ఎ చాల బావుండనిపిస్తుంది. అప్పుడు టీవీ & రేడియో లో ప్రోగ్రామ్స్ చాల informative గా వుండేవి , ఈమధ్య చూసిన ప్రోగ్రామ్స్ లో గొడవల్లు తప్ప ఏమి లేదు. అన్నింటికీ సేన్సషనల్ ఎ అంటారు.but no one reacts.hope to see useful programs

  nice work and nice clips seen after a long time

  ReplyDelete