Monday, November 9, 2009

కబుర్లు - నవంబర్ 9


నిన్న టీవీ 9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ కి పెద్ద దిక్కు (అని ఆయనే చెప్పుకునే) దాసరి నారాయణ రావు గారు ఒంటి చేత్తో కార్యక్రమాన్ని సజావుగా జరగనివ్వకుండా చేసారు. మైక్ చేతిలో ఉంటె ఆయన భూమ్మీద ఉండరు కదా. ఆయన ఇంగ్లీష్ వింటే మనసు పులకించింది. మైదకూరు  లో స్కూల్  పిల్లలకి I never speak in Telugu అని  పలక మెడలో వేసినట్టు, ఈయనకి  I will never speak in English  అని మెడలో వేయించాలనిపించింది. సంగీత విభావరులు బానే ఉన్నాయి కానీ, మధ్య మధ్య లో దాసరి గారు, జస్ట్ వన్  సాంగ్, థాంక్స్ యు అని వాళ్ళని కట్ చెయ్యడం చాలా బాధేసింది. సభ మర్యాద కూడా లేకుండా, పాడుతుంటే  మధ్యలో ఆపెయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సుశీల గారి జనని శివకామిని పాటతో మొదలు పెట్టారు కార్యక్రమాన్ని. సుశీల గారు పాడడానికి కొంచం కష్టపడ్డారు. ఆవిడ  గొంతు ఉన్నంత నిండుగా ఇంకెవరిదీ లేదు ఆ స్టేజి మీద (బయట  కూడా)  . ఆవిడ కూడా లత గారి లాగా ఇంకొన్నాళ్ళు పాడగలిగి   ఉంటే ఎంత బావుండేదో అనిపించింది.  సుశీల గారి పాట  తరువాత కోటి, కీరవాణి, మణిశర్మ తదితరులు  సంగీత విభావరి కొనసాగించారు.

కీరవాణి గారు 'బంగారు కోడి పెట్ట సాంగ్' గురించ చెప్తూ, 'అప్ అప్ హాండ్స్ అప్' అని ఎవరూ మీలాగా అనలేకపోయారు అందుకే మీరు పాడినదే ఈ కొత్త పాటలో(మగధీర లో ) పెట్టాం అని బాలు గారికి చెప్పారు. దానికి బాలు ఇలా నేను పాడినవి పెట్టి, నన్ను పిలవడం మానేయకండి అని చురక వేసారు. నాకు నచ్చని విషయం ఏంటంటే, తెలుగు లో కొన్ని పాటలని పాడడానికి అనర్హాం ( సూపర్ లో  మిల మిల మెరిసిన కనులకి  పాట గురించి క్లాసు పీకరులెండి ఒక షో లో ) అన్న రీతిలో తిట్టిపోసిన బాలు గారు  బంగారు కోడి పెట్ట పాటని అదేదో కీర్తన లాగ పోటి పడి మరీ పాడారు. అప్పట్లో (ఒరిజినల్ పాడిన టైం లో ) ఐతే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కూడా (స్టార్ నైట్) లో పాడవలసిన అవసరమేముంది.

దేవిశ్రీ ఎప్పటిలాగే పాడలేకపోయినా హడావుడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ పెద్ద గాయకుడు కాదు కానీ మాంచి స్టేజి పెర్ఫోర్మేర్. ఊపు తీసుకొస్తాడు ఏ  షో లో అయినా సరే. Excuse me Mr. Mallannaa పాటని  సుహాసిని చాలా బాగా పాడింది. అల్లు అర్జున్, దేవి శ్రీ , మమత మోహన్దాస్ డాన్స్ కూడా బావుంది.  ఇంకోటి విద్యాసాగర్ గారు  ఈ విభావరి లో కనిపించలేదు. కారణాలు నాకు తెలియవు   కానీ, తమిళులు ఎంతో గౌరవించి, అవకాశాలు ఇచ్చే ఆయనని   మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాదు.

ఆ తరువాత డాన్స్ లు,  స్కిట్లు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప స్కిట్లు పెద్ద గొప్పగా లేవు. కుక్క- టి వి ఛానల్  మీద స్కిట్ కొన్ని బ్లాగ్లలో  చదివిన టపాకి  దగ్గరగా  ఉన్నా బానే నవ్వించింది.  భువన విజయం స్కిట్ మిస్ అయ్యాను. కార్యక్రమం చివరిలో దాసరి ఇదే అదును చూసుకుని, మోహన్ బాబు ని, బాల కృష్ణ ను బాగా  ఎత్తేసారు. మోహన్ బాబుకి మైక్, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం  నన్ను చాలా నిరశాపరించింది  . వజ్రోత్సవాలలో లాగ ఆయన కొంచం వేడి పుట్టిస్తే బావుండేది. చాలా రోజులు చెప్పుకోడానికి. ఇంకొక విషయం గమనించాను. రజనీ కాంత్ ప్రత్యేక అతిధి గా  హాజరు అయ్యారు. ఆయన వచ్చేసరికి రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున  ఒక చోట కూర్చుని ఉన్నారు. రజని కాంత్ రాగానే, గౌరవంగా నాగార్జున లేచి ఆయన సీట్ ఇచ్చి వేరే చోట కూర్చున్నారు.అక్కడే ఉన్న రామ్ చరణ్ లేచి ఆయనకు గౌరవం ఇచ్చి వేరే చోట కూర్చవాలన్న ఇంగిత గ్న్యానం లేదేంటా అనుకున్నాను. అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? చూడబోతే ఈయన కూడా పెద్దగ కలవదేమో ఎవరోతోనూ. చిరంజీవి ఉన్నంత సేపు ఏదో తప్పక వచ్చినట్టు కూర్చున్నారు. నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు. మహేష్ బాబు ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. ఊరంతా ఒక దారయితే ఉలిపిగడ్డ దొక దారని అసల ఎక్కడా దర్శనమివ్వడు బాబు. మహేష్ బాబు కి  బొత్తిగా PR లేదు(లేవు).

ఈ రోజు రామ్ గోపాల్ వర్మా  'అజ్ఞాత్'  అనే కళాఖండం చూసి తరించాను. పచ్చగా ఉన్న అడవి, పిచ్చి పిచ్చి శబ్దాలు, నితిన్ సిక్స్ ప్యాక్ , నిషా కొఠారి (ఇప్పుడు ప్రియాంక ఏమో) ఎక్ష్పోసింగ్  తప్ప సినిమాలో ఏం లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్  చెత్తగా ఉంది (అజ్ఞ్యాత్ ౨ కి ట్రైలర్  లాగా ). డైరెక్టర్ ప్రేక్షకులు  ఫూల్స్ అని అస్స్యూం  చేసుకుని తీసినట్టు ఉంది (నిజానికి అతను లాభ నష్టాలు, ఆడియన్స్ ఇష్టైష్టాలు  అవన్నీ పట్టించుకోడుట. తనకి నచ్చింది తీసేస్తాడుట) . రామ్ గోపాల్ వర్మ కి ఎప్పుడూ చూడనంత భయానకమయిన  అడవి శ్రీ లంక లో కనపడిందిట. అందుకని ఒక సినిమా తీసేసి మన మీదకి వేదిలేసారు. పోనీ భయపెట్తిందా అంటే అదీ లేదు. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానినే అలా అని ప్రతీ చెత్త సినిమాను సమర్థించాను  . ఈ సినిమాకిచ్చిన హైప్ కి హాల్ లో చూద్దాం అనుకున్నా కానీ US  లో రిలీజ్ కాలేదు అదృష్టవశాత్తు.

లాస్ట్ వీక్ హాలోవీన్ కి పిల్లలోస్తారేమో లైట్స్ పెట్టి,  క్యాండిలు అవీ  రెడీ గా  పెట్టుకున్నాం. ఒక్కళ్ళూ రాలేదు. గత యేడాది బోలెడు మంది  పిల్లలు వచ్చారు. ఈ సారేంటో అసల రాలేదు.  వస్తే బోలెడు ఫోటోలు తీద్దాం అనుకున్నా.  కాలిఫోర్నియా లో చలి బానే పెరిగింది.  థాంక్స్గివింగ్ దగ్గర పడుతోంది కదా.  సాయంత్రం కూడా ఇంటి దగ్గరే ఉండాల్సోస్తోంది యాక్టివిటీ ఏం లేకుండా. ఇంక పాపం ఈస్ట్ కోస్ట్ వాళ్ళ పరిస్తితి ఏంటో.

అన్నట్టు  మా ఫ్రెండ్స్ హాలోవీన్ కని ఈ స్కేరీ వీడియో పంపారు.చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నవాళ్లు చెయ్యి  ఎత్తండి.
భయపడినవాళ్ళు కామెంటండి.


19 comments:

 1. స్టార్ నైటుకి రాని వాళ్లని బ్యాన్ చేస్తామని ప్రకటించారు, మరి మహేష్, పవన్ కళ్యాణ్ లని బ్యాన్ చేస్తారేమో చూడాలి.

  ReplyDelete
 2. బాబోయ్ మీకు చాలా ఓపికండి! అవునూ, బాలకృష్ణ ఏదో పౌరాణికం వేసినట్లున్నాడు, ఏవిటా వేషం కమామిషు?

  ReplyDelete
 3. అందుకే మహెష్ నచ్చుతాడు నాకు.. పవన్ కళ్యాన్ కూడా రాలేదనుకుంటా...
  దాసరి ని చుస్తేనే చిరాకు.. అయన ప్రసంగాలు వినాలంటే ఇంకా కంపరం ..
  " నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు " :-))
  ఈస్ట్ కోస్ట్ వాళ్ళం ..చలి అలవాటు అయిపొయింది :-)

  ReplyDelete
 4. @ కన్నగాడు : మహేష్ ని, పవన్ కళ్యాణ్ ని బ్యాన్ చెయ్యడమా, భలేటోరే. ఏదో మాట వరసకి బోలెడు అంటారు వాళ్ళు.

  @ కొత్తపాళీ: నిన్న మీ గీతోపదేశం తో బోలెడు ఓపిక, శక్తి వచ్చాయి :). బాలకృష్ణ భువన విజయం స్కిట్ వేశారుట నేను మిస్ అయ్యాను. యు ట్యూబ్ లో Gulte.com వాళ్ళు పెట్టారు అన్ని వీడియోస్. కావాలంటే వెతికి సాయంత్రం లింక్ ఇస్తా.

  @ మంచు పల్లకి: అందుకే మహేష్ నచ్చుతాడా. వెటకారం గా అన్నారా? నాకు, చాలా మంది మహేష్ ఫాన్స్ కి నచ్చని విషయం ఇదే ఈయనలో , ఎవరితో కలవడు, సినిమాలు రెండేళ్లకొకటి తీస్తాడు.
  పవన్ కళ్యాణ్ కూడా రాలేదు.
  మీది ఈస్ట్ కోస్టా. బావుంది. ఔను , మీ బ్లాగ్ లో టపాలు కనపడవేంటి. వేరే బ్లాగ్ ఎమన్నా ఉందా ??

  ReplyDelete
 5. స్టార్ నైటు లో స్కిట్స్ లో నాకు బాగా నచిన్నది స్మోకే టీవీ- కుకట్పల్లి లో కుక్క . చాల కామెడీ గ వుంది . ఇదిగోండి లింక్

  http://www.youtube.com/v/jzDPczUp_vA

  వజ్రోత్సవాలలో ఇంకా మిగత స్టార్ ఎవెంత్స్ లో చిరంజీవి ని తెగ పొగుడుతారు, అందుకేనోమే మోహన్ బాబు, బాల కృష్ణ ఇలా రేవెంగే తీస్కునారు.

  ReplyDelete
 6. @ Srividya: నిజానికి దాసరి revenge తీర్చుకున్నారు మోహన్ బాబు, బాల కృష్ణ ద్వారా :)

  ReplyDelete
 7. వెటకారం కాదు.. నిజం గానే.. పవన్ కళ్యాణ్ మహెష్ అందుకే నచ్చేది.. ఫేన్స్ కొసం తన పర్సనల్ లైఫ్ ని త్యాగం చేయ్యడు.. నిర్మొహమాటం గా మాట్లాడతాడు (మాట్లాడితే) .. కొన్నాళ్ళక్రితం ప్రస్తుతం మీరే నెం. 1 అనుకుంటున్నారా అంటే ..లేదు చిరునే మెగాస్టార్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు (జూనియర్ ఎన్ టి అర్ అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడా)..

  ఈస్ట్ కోస్ట్ నుండి వెస్ట్ కి మారుతున్నా నెలాఖరుకి .. :-)

  ReplyDelete
 8. @ మంచు పల్లకీ - ఇది ఫాన్స్ కోసం కాదు కదా, ఒక మంచి పని కోసం (జరిగిన మంచి తక్కువే అయినా,పేరుకే అయినా), దానికి కూడా రాకపోతే ఎలా?

  వెస్ట్ కోస్తున్నారా గుడ్.

  ఇంతకీ మీ బ్లాగ్ గురించి చెప్పలేదు.

  ReplyDelete
 9. ఈ ఈవెంట్ కాదు.. జెనెరల్ గా చెబుతున్నా..

  నాకు బ్లాగ్ లేదు... అంటే ఎప్పుడో ఒపెన్ చెసాకానీ ఎప్పుడూ ఎమి రాయలేదు.. రాసే టాలెంట్ అందరికీ వుండదు కదా :-)

  ReplyDelete
 10. @ మంచు పల్లకీ: సరే ఒప్పుకున్నాను మహేష్ విషయం.

  బ్లాగ్ రాయడానికి మీకు టాలెంట్ లేకపోవడమేన్టండి. మీరు కచ్చితంగా బాగా రాయగలరు అని నా ఫీలింగ్. మీరు మొదలెట్టండి చెప్తాను. నేనే రాయగా లేనిది మీరు రాయలేరా

  ReplyDelete
 11. :-))

  వీకెండ్ లొ Double Indemnity చూసా.. 1940's మూవి అయినా.. సినిమా స్టార్ట్ నుండి ఫినిష్ వరకూ కళ్ళు పక్కకు తిప్పం.. బావుంది

  ReplyDelete
 12. @ మంచు పల్లకీ: ఔనా ఐతే చూసేస్తా. నాకు పాతవంటే మరీ స్లోగా ఉంటాయేమో అని భయం. ఇప్పటి వరకు సిటిజెన్ కేన్ కూడా చూడలేదు. కాసాబ్లాంకా మాత్రం నచ్చింది బాగా

  ReplyDelete
 13. నాకు అదే భయం.. స్లొగా వుంటాయేమొ అని.. కానీ కొన్ని బలే వుంటాయ్..
  12 angry men చాలా రోజులు చూడలేదు.. ఈ సినిమా మొత్తం ఒకే రూం లొ వుంటుంది.. కొర్ట్ లొ వుండే ఒక మీటింగ్ రూం లాంటిది.. ఒక్క రూం లొ సినిమానా .. బోర్ అని చాలరోజులు చూడలా.. కానీ చూసాక బలే వుంది అనిపించింది..

  ReplyDelete
 14. @ మంచు పల్లకీ: 12 angry men చూడలేదు కానీ అది బావుందని, దాని రీమేక్ హిందీ లో కూడా బావుందని విన్నాను. మీరు కావాలంటే నా gmail id (ప్రొఫైల్ లో ఉంది) కి కూడా పంపచ్చు మెసేజెస్.

  ReplyDelete
 15. Your comments are good.

  I feel with Dasari Narayanarao entrace, Telugu Film industry got Virus. Thank GOD he couldn't influence any Young and Dynamic and upcoming Telugu Directors.

  ReplyDelete
 16. ఆ హాలోఇన్ వీడియో ఏదన్నా మూవీలోదా? నిజంగా చాలా భయపెట్టారండి!! :-)

  "అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? "

  వాళ్ళ నాన్నకి మానసిక ధైర్యం ఇవ్వడం కోసం ఏమోనండి! అస్సలు పక్కన్నించి కదల్లేదు!

  ReplyDelete
 17. @ నిషిగంధ - అది తమిళ్ సూపర్ స్టార్ (:)) సాం అండెర్సన్ సినిమా లోనిది. ఈయనవి ఇలాటి స్కేరీ వీడియోస్ చాలా పాపులర్.

  "వాళ్ళ నాన్నకి మానసిక ధైర్యం ఇవ్వడం కోసం ఏమోనండి!" - కావచ్చు :)

  ReplyDelete
 18. @ Madduri : థాంక్స్ బావా.

  ReplyDelete
 19. నా బ్లాగ్ లో వీరోచితం గా వ్యాఖ్య వ్రాసిన మీ ధైర్యానికి నా అభినందనలు. అక్కడ సమాధానం వ్రాసాను గమనించగలరు

  ReplyDelete