"సినిమా ఎలా ఉంది రా ?"
" రకరకాలుగా ఉంది "
"అంటే బావుందా బాలేదా "
" మరీ గొప్పగా లేదు అలా అని చెత్తగా లేదు "
"నాకైతే చాలా రోజుల తరువాత చాలా నాచురల్ గా ఉందనిపించింది . వయోలెన్స్ , అక్కర్లేని డాన్సు లు, ఐటెం సాంగ్స్ లేకుండా రొటీన్ కమర్షియల్ తెలుగు సినిమా నించి రిలీఫ్ లా ఉంది ఈ సినిమా "
" ఇవన్నీ లేకుండా కూడా ఇంకా బాగా తియచ్చు కదరా . మరీ సీరియల్ లా సాగ తీసాడు సెకండ్ హాఫ్ "
" ఆహా .. హీరో కాబట్టి గుడిసెలో ఉన్నా సూట్ వెయ్యాలి అంటావ్ .. మధ్య తరగతి వాడైనా హైటెక్స్ లో పెళ్లి చేసుకున్నట్టు , స్విస్ లో హనీమూన్ చేసుకున్నట్టు చూపెట్టాలి కదా ..
" లేకపోతె నాలాంటి కామన్ ఆడియన్ (:)) ఎలా ఎంజాయ్ చెయ్యగలుగుతాడు సినిమాని "
" ఎడిసావ్ లే ..అది సరే.. మహేష్ మాత్రం బా చేసాడు కదా. "
"మహేష్ ఇరగదీసాడెహే. అసలా ఈ మధ్య భలే చేస్తున్నాడు రా .. ఇది వరకు ఏదో ఆ ముక్కు ఎగపీల్చే ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకోటి ఉండేది కాదు .మరీ చెట్టు చేమ లా ఎమోషన్స్ లేకుండా ఉండడం హీరోయిజం అనుకునేవాడు ఒక్కడు పుణ్యమా అని .. అండర్ ప్లే చేసేవాడు .ఖలేజా నించి సినిమా హిట్ అయినా ఫట్ అయినా యాక్టింగ్ మాత్రం భలే చేస్తున్నాడు . ఈ సినిమా లో గోదావరి యాస భలే పట్టుకున్నాడు .. సినిమా నిలబడితే అది మహేష్ వల్లే . పొతే డైరెక్టర్ వల్ల అన్నట్టుంది ఈ సినిమా .."
"సమంతా కూడా బావుంది మహేష్ పక్కన"
" మిగతా వాళ్ళు కూడా బానే చేసారు .. వెంకీ , అంజలి .ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ "
"
వెంకీ కి ఏడవడం సెంటిమెంట్ పిండడం వెన్నతో పెట్టిన విద్య .. బా చేశాడు .. అంజలి జర్నీ సినిమా లో అమ్మాయి కదా భలే సరిపోయింది ఆ రోల్ కి ..
ఇంక ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో నాకర్థం కాలేదు . అతనేం చేస్తాడో బతకడానికి నవ్వడం కాకుండా .. డబ్బెలా వస్తోందో వాళ్ళకి .. ఇవన్నీ దేవుడి కెరుక .. హీరో పాత్రలు కూడా ఏదో వాక్యూం లో ఉంటాయి .. వాళ్ళ చదువు ఏంటి ఉద్యోగం ఏంటి ఏదీ తెలియదు .. ఇక మిగతా వాళ్ళంతా ఏదో వాళ్ళ పరిమితి లో బానే చేశారు .. రావు రమేష్ మాత్రం చాలా బాగా సరిపోయాడు రోల్ కి .. అతి లేకుండా బాలెన్సడ్ గా చేసాడు .
"
" ప్రకాష్ రాజ్ క్యారెక్టకి డబ్బంటావా .. అమ్మాయి పెళ్లి అయ్యాక చూపిస్తాడు గా ఊర్లో వాడెవడో ఇది నేను సెటిల్ చేస్తా అంటాడు .. ఆ విధంగా తలొకరు సహాయం చేస్తూ ఉంటారేమో వాళ్ళ కుటుంబానికి .. ".
"ఆహా ..నాకు మరీ అంత దూరాలచన లేదు బాబు. తెలుగు సినిమాకి కూడా అంత ఊహించి అర్థం చేసుకోవాడం నా వల్ల కాదు. "
" నా ఉద్దేశ్యం వాళ్ళకి డబ్బు ఎలా వచ్చింది అనేది పెద్ద పాయింట్ కాదు అని "
"నేనొప్పుకోను .. అదీ కాకుండా చివర్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టా రానట్టా నాకర్థం కాలేదు . బామ్మకి గాజులు చేయించే డబ్బెలా వచ్చింది .. అది కూడా ఊర్లో వాళ్ళే ఇచ్చారా "
"వాళ్ళ మంచితనం చూసి పిల్లనిచ్చి పెళ్లి చేసి, కట్నంగా డబ్బు ఇచ్చి ఉండచ్చు కదా "
"వామ్మో ఆ డైరెక్టర్ కూడా ఇంత అలోచించి ఉండదేమో .. ఫాన్స్ ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు .
సో నీ లెక్క ప్రకారం నాకర్థం ఐంది ఏంటంటే సినిమా కథ ఇది - ఇద్దరు డబ్బు , ఆస్తి , ఉద్యోగాలు లేని అన్నదమ్ములు వాళ్ళ నాన్న మంచితనం తో గొప్పింటి అమ్మాయిలని లైన్ లో పెట్టి ఎలా పెళ్లి చేసుకున్నారు ..సో మంచితనం ఉంటే డబ్బు , ఆస్తి , ఉద్యోగం ఏమక్కరలేదు (కుర్రాడు మహేష్ బాబంత అందంగా ఉండకపోయినా ) అని దర్శకుడి ఉవాచ. "
" మరి నువ్వు అలా ఏవేవో ఊహించుకుని కథలు అల్లెసుకుంటే .. నేనేం చెప్పలేను ."
"ఎన్ని సినిమాలోస్తున్నాయ్ రా ఇలా .. ఎప్పుడు చూడు ఒకటే రకం - అయితే యాక్షన్, లేకపోతె ప్రేమ కథ . వచ్చే ఒకటీ అరా డిఫరెంట్ సినిమాలు కూడా ఆదరించకపోతే ఎలా .."
"అదే ప్రాబ్లం అయిపొయింది .. డిఫరెంట్ అని పేరు చెప్పి ట్రైలర్ లో ఊదర గొట్టేయ్యడం తీరా చూస్తే పస ఉండట్లేదు సినిమా లో . చాలా హాలీవుడ్ సినిమాలు ట్రైలర్ కొత్త సినిమా చెత్త , అదే తరహా ఇప్పుడు బాలీవుడ్ కి మన తెలుగు కి కూడా పాకుతోంది ..ఏదో ఒక చిన్న ఐడియా పట్టుకోవడం .. దాన్ని రెండున్నర గంటలకి సరిపడా పెంచలేకపోవడం . పోనీ నిడివి తగ్గిస్తారా అంటే అదీ లేదు రెండున్నరా మూడు గంటలు ఉండాల్సిందే .. అరగంట అయ్యేసరికి వాళ్ళు కొత్తగా అనుకున్న ఆరు సీన్లు అయిపోతాయి .. తరువాత ఏదో చెత్త ."
" ఫార్ములా కంటే ఇది నయం కదా .. అయినా టాపిక్ కి Tangential గా వెళ్తున్నాం. .ఎవరైనా అడిగితే సినిమా చూడమని చెప్తావా చూడద్దని చెప్తావా "
"నయమే లే అందుకే పదిహేను డాలర్లు పోయినా బాధ పడట్లేదు కదా . డైరెక్టర్ ని మూడు విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి - మంచి సాహిత్యం , చక్కని మాటలు , గుండెల్ని హత్తుకునే కొన్ని సీన్స్, ఆత్మ వంచన లేకుండా అనుకున్నట్టు సినిమా తియ్యడం (ఇది దిల్ రాజు సపోర్ట్ వల్ల ).
ఇక వేరే వాళ్ళకి చెప్పడం అంటావా అందరినీ చూడమనే చెప్తా ."
"సో అటు ఇటు గా నీకు సినిమా నచ్చినట్టే.. నువ్వు నా గ్రూప్ లోకి వచ్చినట్టే "
"కాదెహే . నాతో పాటు ఇంకో నలుగురు బాధ పడితే అదో తుత్తి ."
"నువ్వు మారవెహే "
"నవ్వుతాలికి అన్నా గానీ, అమృతాంజన్ రాసుకునే అంత తలనొప్పి రాకుండా , సినిమా మధ్యలో లేచెయ్య కుండా సినిమాని సర్వైవ్ అయ్యానంటే .. అది ఇంకోళ్ళని చూడమని చెప్తా. అది నా పాలిసీ .. తెలుగు సినిమాల వరకు "
"నువ్వు ఇంకో సారి చూస్తావా మరి ."
"నీకో దండం రా సామీ ! "
"ఇంకో సారి చూసే ప్రశ్నే లేదంటావ్ "
"రెండో సగం లో ఓ సగం కత్తిరించి రెండు పాటలు తీసేసి ఓ మూడు మంచి పాటలు (రెహమాన్ వో కనీసం దేవిశ్రీ వో ) పెడితే ఇంకోసారి డి వి డి లో చూస్తా .."
"పాటలు కొత్త బంగారు లోకం అంత బాగా ఇస్తాడ నుకున్నా ..చాలా disappoint చేశాడు "
" లిరిక్స్ బావున్నాయి లే .. ఓ మూడు పాటలు మ్యూజిక్ కూడా బావుంది .. ఆ వెంకీ పాట మాత్రం ఘోరమయా.. "
" అది ఒప్పుకుంటా .. కానీ వినగా వినగా బావున్నాయి రా. బహుశా సాహిత్యం వల్లేమో . నువ్వు విను నచ్చుతాయ్. నేను రేపు షో కి టికెట్స్ బుక్ చేసుకుంటున్నా .. నీకు డి వి డి వచ్చాక చెప్తా :) "
" జిహ్వకో రుచి .. మనిషికో పిచ్చి .. అలాక్కానీ .."
(Images - Courtesy: Google images, idlebrain.com )
కాదెహే . నాతో పాటు ఇంకో నలుగురు బాధ పడితే అదో తుత్తి ."
ReplyDeleteGreat...
హ హ ఇంతకీ మాట్లాడుతున్న ఇద్దరిలో మీరెవరు ?:P
ReplyDelete@Sravya - రెండూ నేనే (మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ )..
ReplyDeleteహహహ రెండూ మీరేనా ఐ లైకిట్ :-))
Delete
ReplyDeleteచాలా రోజుల తర్వాత కనబడుతున్నారండీ, ఐమీన్ మీ బ్లాగ్‌లో.. నైస్ టు సీ యూ బ్యాక్ :)
ఇద్దరూ మీరేనా.. అద్దం బయట, లోపలా అన్నమాట :))
థాంక్స్ నిషిగంధ గారు .. రాయాలని ఉన్నా రాయడానికి, రాసేంత ఏమీ ఉండట్లేదు ..
Deleteఉన్నా లేకపోయినా ..ఇంకా తరచుగారాద్దాం అనుకుంటున్నా చూద్దాం ..
రివ్యూ డిఫరెంట్ గా ఉంది :)
ReplyDeleteథాంక్స్ . రివ్యూ కాదు ఏదో నాకు అనిపించినవి, అవీ , ఇవీ కలిపి ఇలా ..
Delete