ఆర్చీస్ లో
అటు చూస్తే టెడ్డీ బేరూ ఇటు చూస్తే తాజ్ మహలు ఏది కొనాలో సమస్య తగిలిందొక యువ ప్రేమికుడికి
ఆమెని
స్పైస్ జెట్ లో గోవా కో
లాంగ్ డ్రైవ్ లో కూర్గ్ కో
తేల్చుకోలేని సమస్య ఒక నవవరుడికి
ఆవిడతో
మల్టీప్లెక్స్ లో మహేష్ సినిమా కో
ఒహ్రీస్ లో డిన్నర్ బఫేకో
ఎటు పోవాలో సమస్య కలిగిందొక మధ్య వయస్కుడికి
ఆవిడ చూసే వసంత కోకిలా నే చూసే టి వి న్యూసా
ఆలోచించే సమస్య లేదు ఆ వృద్ధ మిథునానికి
శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో
చాలా బాగుందండి.
ReplyDeleteThanks జయ garu
Delete