Monday, October 12, 2009

ఎన్నాళ్ళయింది


- వాసు


ఎన్నాళ్లైంది..
కమ్మని అమ్మ వంట తిని
నాన్నతో తీరికగా కబుర్లు చెప్పి
నా మేనకోడలు ముద్దు మాటలు విని
ఇష్టమ్లేని హిందీ సీరియల్స్ మా అక్కతో, తెలుగు సీరియల్స్ మా అమ్మతో సీరియస్గా చూసి ఎన్నాళ్లైంది

ఇరుకైన రోడ్లలో ఉరకలేస్తున్న బైక్ నడిపి
బారులు తీరిన లైన్లలో గంటల తరబడి నించుని సినిమా చూసి
అర్థ రాత్రులు నిద్ర పట్టక విరబూసిన వెన్నెలలో వూరంతా షికారు చేసి
కాలనీ చివర మా గ్యాంగ్తో మూడింటికి ఐస్ క్రీమ్ తిని ఎన్నాళ్లైంది


వాన తుమ్పరలో వీధి చివర బొగ్గుల్లో కాలుతున్న మొక్క జొన్న కండి
వేడి వేడి చాట్ ని వేళ్ళు ముంచి వేసిన పానీ పూరీని రుచిగా వడ్డించే బండి చూసి ఎన్నాళ్లైంది


గ్రూప్ స్టడీలని గ్యాప్ లేకుండా కబుర్లు చెప్పుకుని
గుడుంబా గాడి రూమ్ లో రాత్రంతా పేకాడి
మేడ మీద, ఆకాశం కింద తీరిగ్గా పడుకుని చుక్కలని లెక్కెట్టి
పోరుల గురించి సినిమాల గురించి డిస్కషన్లు పెట్టి
ఎన్నాళ్లైంది

పెద్దగా పని లేకపోయినా క్షణం కూడా తీరికలేని
జేబులో పది లేకపోయినా కొంచం కూడా బాధలేని
నడిచేది ఎంత దూరమైనా కాళ్ళకు నొప్పి రాని
నేస్తాలతో నడిచే ఆనందాన్ని
చవిచూచి ఎన్నాళ్లైంది












8 comments:

  1. chaaaaaala bagundi...!!
    Ikkada leka nuvvu avanee miss avuthuntey.. ikkadey undee memu miss avuthunnavi chalaney unnayi..

    ReplyDelete
  2. @ హనుమంత్ గారు, పద్మర్పిత గారు - థ్యాంక్స్

    @ శుభప్రద - నువ్వు కూడా సంసార జంఝాటం లో పడి చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నావా ??

    అయినా మన బ్యాచ్ వి హ్యాపీ (హ్యాపీయెస్ట్) డేస్ అయిపోయాయని నా ఫీలింగ్.

    ReplyDelete
  3. కమ్మనీ అమ్మ చెతి వంట లాగ వుంది ఈ కవిత్వం. వహహ్

    ReplyDelete
  4. Father: Nice
    Mother: "Nuvvu avanni miss avutuntee, memu ninnu miss avutunnamu"
    Sister: It is quite touching; remainds every one of "KAHAA GAYE VO DIN".
    Bava: Excellent, as usual you will touch the hearts.

    ReplyDelete