Wednesday, October 28, 2009

టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానం

ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ఈ పాటికి మైదకూరు లో జరిగిన ఉదంతం, దాని మీద చేసిన రాగ్దాంతం చూసి ఉంటారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులు మెడలో I never speak in telugu అని రాసి ఒక బిళ్ళ తగిలించడం.  


ఈ టీవి చానల్లు తెలుగు భాషను ఉద్ధరించేస్తున్నట్టు, తెగ బాధ పడిపోతున్నాయి. ఇప్పుడే టి వి 9 ఒక కార్యక్రమం చూసాను (అమ్మకి అవమానం) కొంచం చూసి ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారా అనిపించింది. ప్రతీది రచ్చ చెయ్యడం వీళ్ళకి అలవాటైపోయింది. ముందు ఎవరన్న వీళ్ళ మీద ఒక ఉద్యమం మొదలెట్టాలి. పరబాష లో కార్యక్రమాలు, వాటి పేర్లు ఉండకూడదని. ఒక్కళ్ళకి 'ళ' 'ణ' పలకడం రాదు. ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో 90% ఆంగ్ల పదాలే. టీవీ 9 లో ఐతే బూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలుగు కార్యక్రమం పేరుండదు.  


ఇక ఆ పాఠశాలలో జరిగిన విషయమైతే చాలా శోచనీయం. కానీ అలాటివి బోళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడాలని తల్లి తండ్రులకు ఉంటే తప్ప చెయ్యకలిగిందేమి లేదనిపిస్తుంది నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఫ్యూచర్ లో కష్టం అని అంటారు. మైదుకూరు లాటి సంఘటనలు జరిగే సరికి, జనాల్లో రగ్గు కప్పుకుని నిదరపోతున్న భాషాభిమానం, మాతృ బాష మీద ప్రేమ పొంగుకొచ్చేస్తాయ్ . సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏవేవో ప్రతిపాదించేస్తారు . ఆంగ్లం రద్దు చెయ్యాలి, తెలుగు ని ముద్దు చెయ్యాలి అని. తెలుగు నేర్చుకోడానికి , కేవలం తెలుగు లో బోధన, ఆంగ్లం వాడకపోవడం కాదు కావాల్సింది. తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగచెయ్యాలి పిల్లలకి. ఇష్టంగా పిల్లలు చదివేడట్టు పుస్తకాలు, లేక సి డి లు (ఇవి కొన్ని ఇప్పటికే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువగా) రావాలి. చందమామ లాటివి చదవడం అలవాటు చేస్తే, వాటి కంటే మేలు చేసేవి ఉండవు భాషా వికాసానికి. పెదబాల శిక్ష ఉంటే బూజు దులిపి, లేకపోతె కొని, పిల్లలకి చదివి చెప్పాలి, చదివించాలి. హ్యారీ పాటర్ (నేను చదవలేదు, మంచి పుస్తకమని విన్నాను)ని తలదన్నే పుస్తాకాలు తెలుగులో ఉండి ఉంటాయ్. కాకపొతే ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉన్నంత ఆసక్తి తెలుగు పుస్తకాల మీద ఉండేడట్టు తల్లి తండ్రులు చెయ్యాలి. ఈ భాషా సంఘాలు,తెలుగు విశ్వవిద్యాలయాలు నిజంగా ఎమన్నా చేయదల్చుకుంటే, కొంత డబ్బు వెచ్చించి, బాలల సాహిత్యాన్ని మంచి నాణ్యతతో, ప్రమాణాలతో ప్రచురించాలి. (తినాలంటే రుచి తో పాటు రూపు కూడా అవసరం కదా ). వీలయితే పాఠశాలలకి ఉచితంగా కాపీలని ఇవ్వాలి. తరచూ పిల్లల కోసం తెలుగు భాష కి సంబంధించిన  వినోద కార్యక్రమాలు నిర్వహించాలి . ముఖ్యంగా ఇలాటి వాటిలో సుదీర్ఘ ఉపన్యాసాలు అవి ఇచ్చి బెదరగొట్టకుండా , వారికి నచ్చే రీతిలో చెయ్యాలి. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేడట్టు చూడాలి. నాకు టీవీ లో పాటల పోటీలు అవి చూసినప్పుడు, తెలుగు భాషకేం ఢోకా లేదు అనిపిస్తుంది, అంత స్పష్టంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య తక్కువనుకోండి.  


మాతృ భాషలో విద్యా బోధన ఇవన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులలో అసాధ్యం కానీ, కనీసం తెలుగు ఖచ్చితంగా తీసుకోవాలి అని హైస్కూల్ వరకు అన్నా పెడితే బావుంటుంది (ఇది ఇప్పటికే ఉందేమో నాకు తెలియదు. ఉంటే పాటించట్లేదని మాత్రం చెప్పగలను .)  


మైదకూరు ఉదంతం వల్ల జరిగిన మంచి ఎమన్నా ఉంటే, అది జనాలు ఓ నాలుగు రోజులు తెలుగు గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత మల్లి మామూలే, మర్చిపోతారు.  


ఈ సందర్భం లో నేను రాసిన పాత టపా ఒకటి గుర్తుకొచ్చింది. టి వి చానల్లు, సినిమాలలో తెలుగు గురించి. http://maanasasanchara.blogspot.com/2008/06/blog-post.html




P.S. రాము గారు ఈ అతిని ఇంకా బాగా ఎండగట్టారు. చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_2



8 comments:

  1. నిజమే. పిల్లల్లో మాతృభాషాసక్తి కలిగించాల్సింది తల్లిదండ్రులే. స్కూళ్లు తమ పని తాము చేస్తున్నాయి (కానీ బోర్డులు వేలాడదీయటం మాత్రం దారుణం). నేనెరిగిన ఓ తెలుగు ఫ్యామిలీ - అమెరికాలో నివాసముండేది - తమ నాలుగేళ్ల కుమారుడి కోసం ఇంట్లో తెలుగు మాట్లాడటం పూర్తిగా మానేసి కేవలం ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు. లేకపోతే వాళ్ల పిల్లాడికి ఇంగ్లీష్ రాదని వాళ్ల భయమట! వాళ్ల చిన్నతనంలో, వాళ్ల ఇళ్లలో శుభ్రంగా తెలుగే మాట్లాడినా ఆ ఇద్దరికీ ఇంగ్లిష్ బాగానే వచ్చిందన్న సంగతే గుర్తుండదు!! మొత్తమ్మీద, ఆ పిల్లాడికి తెలుగు రాదు. ఆ విషయం వాళ్లకి గర్వకారణం. ఏం చెబ్తాం?

    ReplyDelete
  2. హ్యారిప్యాటర్, భట్టి విక్రమార్క కథల ముందు ఎందుకూ పనికి రాదండి. భట్టి విక్రమార్క కథలు ౩౬౫. రోజుకి ఒకటి చొప్పన చదివినా సంవత్సరం చదవవచ్చు. చిత్రవిచిత్రమైన మలుపులు, అద్భుతాలు, ఆలోచన్లు రేకెత్తించే కథలు. ఇంకా ఇవే కాకుండా తెలుగుసాహిత్యంలో ఇంకా చాలా ఉన్నాయండి.

    ReplyDelete
  3. @ అబ్రకదబ్ర: మీరన్నట్టు అంగ్లమో తెలుగో ఏదో ఒకటే వస్తుందని పిల్లలకి ఒక బలమైన అపోహ/భయమో ఎక్కువ మందిలో ఉంది. కానీ ఇక్కడ (బే ఏరియా లో )కొంతమంది మాత్రం ఆంగ్లం ఎలాగో వస్తుంది కాబట్టి, పిల్లలకి శ్రద్ధగా మన బడి లాటి లాటి మంచి కార్యక్రమాలను వాడుకుంటున్నారు.

    @ అమ్మ వడి: భట్టి విక్రమార్క కథలు నేను కూడా చదవలేదండీ. గొప్పగా ఉంటాయన్నమాట. నేను తెలుగులో చదివిన సాహిత్యం చాలా తక్కువ. సాధారణంగా మన వాళ్ళు మనది బాగున్నది అని చెప్పటానికి పక్కవాటిని తీసి పారేస్తారు. అది నా ఉద్దేశ్యం కాదు. హర్రి పోట్టర్ లో ఏదో ఉండకపోతే అంత మంది చదవరు, చెప్పరు. అందుకని అంత కంటే గొప్పవి తెలుగులో ఉంటాయని తెలిసినా (ఉండి ఉండవచ్చు) అలా రాశాను.

    ReplyDelete
  4. Vasu, munduga, naa daggara telugu font ravatledu.. so English lo raastunnanduku kshaminchali! vishayanikosthey, udyamalu gatra tarwata.. mundu thallidanrulaki maa pillalu telugu lo matladatharu ani cheppukotamey siggu ga untondi ee madhya! maa ammayi ki telugu peddaga radandee ani garvamga cheppukuntunnaru! paakatam vachhinappati nunchi sit, stand ani nerpistunnaru!! vallakey leni matrubhasha patla premani pillalaki ela kaligistaaru?? mundu pedda valla burralaki pattina english boojuni dulipithey telugu bhasha bhavishyaththu ki dhoka ledu! chinnappudey thega saahityam chadivesi chandhobadhdham ga padyalu raseyyamani evaruu cheppatledu.. kaneesam chandamama, baalamitra chadivisthey entha baguntundi! Harry potter adbhutam ga untundi! chaduvuthuu unte.. chadavalanipistundi. telugu lo anthaku minchina kadhalu boooooooldunnayi! ika paina kuda manchi saahityam telugu lo raavali ante asalu ee taraaniki telugu chadavatamey raadeyy...!!! ee sandarbham ga oo link ivvalani undi.. India lo untunna vallakante videsallo untunna vaari bhashabhimaanam paallu chaaaaaaaaaala ekkuva! daaniki saakshi ee link: http://blog.vihaari.net/2009/08/blog-post_30.html

    ReplyDelete
  5. annattuuu, aavesam lo mudraarakshasalani pattinchukoledanukuntaa :)

    ReplyDelete
  6. @ శుభ

    నీ బాధ, ఆవేశం బాగా కనపడుతోంది నీ వ్యాఖ్య లో.
    నువ్వన్నట్టు మన దేశం లోనే ఈ జాడ్యం ఎక్కువుంది (తెలుగు ని నిర్లక్ష్యం చెయ్యడం). ఇక్కడ తెలుగు భాష విషయం లో సిలికాన్ ఆంధ్ర చాలా మంచి కార్యక్రమాలు చేసింది. నేను ఉగాదికి వెళ్తూ ఉంటా. అప్పుడు కవి సమ్మేళనం, పదహారణాల తెలుగు వాతావరణం ఉంటుంది. కాల యంత్రం లో ఒక ౧౦౦ ఏళ్ళు వెనుకకి వెళ్తే మన రాష్ట్రం ఇలా ఉండేదేమో అనిపిస్తుంది . కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది సిలికాన్ ఆంధ్ర అంటే మరీ కచేరీలు, నాటకాలూ, మరీ బోర్ కొట్టించేస్తారు అనుకుంటారు. ముఖ్యం లక్ష గల సంకీర్తన హైదరాబాద్ లో బాగా పేరు తెచ్చింది. అందరికీ బాగా తెలిసింది. ఈ మన బడి బాగా నచ్చింది. వాలంటీర్ గ వెళ్దామనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు.

    ఇంకో విషయం, ఇది రాస్తున్నంత సేపు, ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేనేం చేసాను అనిపించింది. కనీసం ఆ మన బడి వాలంటీర్గా అన్నా చేరాలి.

    ముద్రణారాక్షసాలు (దీనికి ఇంకో పేరేదైనా ఆలోచించాలి బ్లాగ్ దృష్ట్యా) చాలా వరకు దిద్దాను ఇప్పుడు. ఆవేశం కాదు శుభా ఆలస్యం అవుతోందని, జాప్యం చెయ్యకుండా పని లో ఉన్నపుడు రాసేశాను.

    లిపి గురించి అంత పెద్ద మాటలు అక్కర్లేదు. ఈ లంకె వాడు ఈ సారి నించి తేలికగా ఉంటుంది. .http://www.google.com/transliterate/indic/TELUGU

    ReplyDelete
  7. asandarbham aina, oka anumaanam... mudraa raakshasaalu ani vinna kaani.. mudranaa raakshasaalu vinaledu.. ala raayatam venuka edaina aantaryam undaa?

    ReplyDelete
  8. నేను ఇప్పటి దాకా ముద్రణా రాక్షసాలు (printing mistakes) అనుకునే వాడిని. ఎందుకు తెలియదు అలాగే ముద్ర పడిపోయింది బుర్రలో. సరిచేసినందుకు థాంక్స్. సరియైన పదం - ముద్రా రాక్షసాలు. అన్నట్టు గూగిలిస్తే ఇంకో విషయం తెలిసింది ముద్రారాక్షస అనేది విశాఖ దత్తుడి సంస్కృత నాటకం ట

    ReplyDelete