Saturday, May 16, 2009

జె. పి. గారూ ! కె.పి మీ చేతుల్లో

నెల రోజుల నిరీక్షణ నేటితో ముగిసింది. ఫలితాలు వెల్లడి ఇంకో ఐదేళ్ళ మజిలీకి తెరతీసింది. ఈ సారి ఎన్నికలకి ఎప్పుడూలేనంత ఉత్సాహం. ఫలితాల కోసం ఆతృత.

ముఖ్యంగా మా నియోజికవర్గంలో ఒక మంచి నాయకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ నిలబడినందుకు నాకుగర్వంగా ఉంది. కానీ వోట్ వెయ్యలేకపోయినందుకు చాలా బాధ పడ్డాను నిన్నటి వరకు. ఈ రోజు ఆయన గెలిచారన్నశుభవార్త చెవిలో పడేవరకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు
కొంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

నిజానికి ఆశించిన దానితో పోలిస్తే ఇది తక్కువ అయినా, మా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజికవర్గంగాతీర్చిదిద్దడానికి లోక సత్తాకి అవకాశం వచ్చినందుకు, లోక సత్తాని గెలిపించే అవకాశం మా నియోజకవర్గానికివచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

జె. పి గారూ ! శుభాకాంక్షలు. లోక సత్తా రాజకీయ ప్రయాణం మొదలైంది. స్వచ్చమైన కొత్త రాజకీయాలకి ఇది నాందికావాలని ఆశిస్తున్నాను.

కూకట్ పల్లి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మీ నాయకత్వం
లో రూపు దిద్దుకోవాలని, మున్ముందు లోక సత్తాతీసుకు రాబోయే ఉత్తమ రాజకీయ ప్రమాణాలకి తొలి మలుపు కావాలని ఆకాంక్షిస్తూ..

లోక సత్తా అభిమాని,
వాసు

7 comments:

  1. కూకట్ పల్లి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మీ నాయకత్వం లో రూపు దిద్దుకోవాలని, మున్ముందు లోక సత్తాతీసుకు రాబోయే ఉత్తమ రాజకీయ ప్రమాణాలకి తొలి మలుపు కావాలని ఆకాంక్షిస్తూ...
    మీ ఆకాంక్షే నాదికూడా
    జయప్రకాశ్ నారాయణ్ గారికి అభినందనలు తెలుపుతూ మీ ఈ మొద
    టి అడుగు అప్రతిహతంగా సాగే మంచి ప్రయాణానికి నాంది కావాలని కోరుకుంటున్నాము.

    ReplyDelete
  2. వాసు గారు.. ఇతర ఫలితాలు ఎలా ఉన్నా నేనూ కూకట్ పల్లి కే చెందడం వల్ల అదీ ఓటు వినియోగించుకోవడం వల్ల జె.పి. గెలిచారన్న వార్త తెలిసేవరకూ, అదీ 15 వేలకు పైగా మెజారిటీ సాధించారని తెలిసే వరకూ కొంతైనా జనాల్లో ఆలోచన మిగిలి ఉందన్న నమ్మకం కుదిరింది, అన్ని చోట్లా షాక్ కి గురిచేసిన ఫలితాలు ఆ ఒక్క విజయంతో సంతృప్తిని మిగిల్చాయి.

    ReplyDelete
  3. జయహో .....జే పి గారూ ...

    ReplyDelete
  4. అదే మా ఆశావాదుల ఆఖరి వెలుగు .
    జయహో !!

    ReplyDelete
  5. అందరికీ ధన్యవదాలు. జెపి జయహో!

    ReplyDelete
  6. JP గారికి అభినందనలు!!!

    ReplyDelete