Sunday, December 20, 2009

అవతార్ - పెద్ద గొప్ప సినిమా కాదు - నాకు నచ్చనివి


జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు  లైన్ లో వెయిట్ చేసి   (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి  ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు  పెట్టిన  వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి.  కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.


  • సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు  అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు. 
  • హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
  • కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు  . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
  • ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
  • మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా. 
  • పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
  • 3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు. 
  • ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
  • కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు. 
  • ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012  (ఇల్లోజికాల్ అయినా )  ఎక్కువ నచ్చింది. 

10 comments:

  1. 'టూబీ ఆర్ నాట్ టూబీ..' గొప్ప సందిగ్ధతే వచ్చింది నాకిప్పుడు..

    ReplyDelete
  2. మేము ఒక 15 మంది కలిసి సాయత్రం షో కి వెళ్ళాము.అందులొ ఒకరిద్దరికి తప్ప ఎవరికీ ఈ సినిమా నచ్చలేదు.అందరూ అనుకున్నది ఒక్క మాటే....2012 దీనికన్నా చాలా చాలా బాగుంది సినిమా సగం నుండి థిఏటర్ లో జనాలందరూ పదే పదే ఆవులించడం చూస్తే హమ్మయ్యా మాకే కాదు మిగతావాళ్ళకి కూడా బోరుకొడుతుందన్న మాట అని కొంచెం సాటిస్ఫై అయ్యాను.ఐడిల్ బ్రైన్ జీవీ ని,రాం గోపాల్ వర్మ ని నమ్మి వెళితే ఇలా జరిగింది.

    ReplyDelete
  3. మీరన్నది నిజమే. మరీ గొప్ప సినిమా కాదు కానీ, గొప్ప సినిమానే.
    ముఖ్యంగా కామెరూన్ ఊహ శక్తికి జ్యోహారులు.
    అయితే మరీ భారీ అంచనాలతో వెళ్తే నిరాశ చెందవచ్చు. 3డి ఎఫ్ఫెక్ట్స్ మటుకు నిరాశ పరుస్తాయి. నేను సినిమాను రెండు సార్లు చూసాను.

    మొదటి సారి, రియల్ 3డిలో. అద్భుత అనుభూతి.
    రెండో సారి, ఐమ్యాక్స్ 3డిలో వెళ్ళి తప్పు చేశా. ఎందుకో నీరాశ ఎదురైంది.
    అది థియేటర్ లోపమ, లేదా సినిమాను ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ కు తగ్గట్టు re-master చెయ్యడంలో లోపమా అర్ధం కాలేదు.
    నాకు అంత తేడా యేమి తెలియలేదు. నా వరకు రియల్ 3డిలోనే బాగుంది అనిపించింది.

    ReplyDelete
  4. ఫణి గారు, నాకు ఉన్న సందేహాన్ని మీరు మీ కామెంట్‌తో తొలగించారు. నేను Imax 3Dలో చూసాను. కానీ నాకు RealD 3D or Dolby 3Dలో అయితే ఇంకా 3D effects realisticగా ఉంటాయనిపించింది. RealD 3D and Dolby 3D are technically better than Imax 3D, which unfortunately uses older 3D projection.

    ReplyDelete
  5. నాకు కూడా పర్వాలేదు బానే వుంది అనుకున్నా అంతే మరీ సూపరేమి కాదు. మా అబ్బాయి కి మాత్రం తెగ నచ్చేసి అసలు ఈ సినిమా కు ఆస్కార్ లు రాక పోతే నేను ఆస్కార్ లు చూడటం మానేస్తా (అక్కడికేదో ఆస్కార్ వాళ్ళు వీడు చూడకపోతే చిన్నబుచ్చుకున్నట్లు) అని శపధం చేసేడు. నా పక్క న ఒక చిన్నోడూ కూర్చున్నాడూ వాడూ మధ్యలో ఎక్కడో, ఇంకా అవ్వలేదా సినిమా అన్నాడు గట్టిగా, నేను అప్పుడు నిజానికి సినిమా ఐపోతుందేమో అనుకున్నానేమో నిజమే కదా ఈ బుడ్డోడు బలే అన్నాడే అనుకున్నా. :-) జనాలు సినిమా చివరి లో నుంచుని చప్పట్లు కొట్టేరు. (సినిమా నచ్చి... ఐపోయినందుకు కాదు) మరి మా బోస్టన్ వాళ్ళకు బాగా నచ్చింది అనుకుంటా.

    ReplyDelete
  6. అవును పవన్ గారు. ఐమ్యాక్స్ లో ఇమేజ్ స్క్రీన్ మొత్తం రావటం లేదు. ఇంచుమించు ప్రతి థియేటర్ లో డాల్బీ సౌండ్ వుంటోంది కాబట్టి రియల్ 3డి బెస్ట్.
    For those in USA, Imax is definitely the best experience, but not for this movie.
    You can get a good experience for $9 by watching it in Real 3D, instead of spending $18 for Imax 3D

    ReplyDelete
  7. ఫణి గారు, మీరు అనుకున్నట్టు నేను Dolby 3D అంటే సౌండ్‌ గురించి మాట్లడలేదు. Dolby 3D is a competitor to RealD 3D and Imax 3D. ఇవే కాక expanD అని ఇంకొక 3D ప్రొజె్క్షన్‌ టెక్నాలజీ ఉంది. RealD and expanD are digital 3D while Imax is not. RealD is supposed to have better color reproduction than the Imax 3D. Also Imax 3D tends to have the 3D effects popping out of the screen while the other systems tends to have a 3D environment within or behind the screen.

    ఇంతకీ ఏఊరండీ బాబు మీది? మా ఊరిలో Imax 3D టికెట్‌ $13.50 మాత్రమే.

    ReplyDelete
  8. బావుంది. 3D గురించి మాంచి జరుగుతోంది గా. నేను IMAX 3D లో చూసా. రియల్ 3D లో చూద్దామా అని ఆలోచిస్తున్నా, ఎమన్నా బెటర్ గ ఉంటుందేమో అని

    ReplyDelete
  9. మీరందరూ ఎలా చూసారో నాకు తెలీయదు గాని, నేను మాత్రం తెలుగు డబ్బింగ్ వర్షన్ లో చూసాను అది ఒక మామూల్ థియేటర్లో, నాకు మాత్రం అద్భుతం అనిపించింది, పాండోర లోకం లో ఆటవికుల స్వచ్చమైన మనసు, వారికి ప్రకృతితో ఉన్న మానసిక బంధం, నాగరిక ప్రపంచం లో మనిషి తన వ్యక్తిగత అభివృద్ది కోసం దేనికైనా తెగించడం అంటే మనిషికి అదృష్టంగా లభించిన ప్రకృతినే తన స్వలాభకోసం తెగనరుకుతుంటే, ఎటువంటి నాగరికత తెలీయకపోయినా అటువికులైనా గాని మన నాగరికులకంటే ఆ అటవికులు మనసున్న మారాజులుగా చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమైపోవడం ఒక అపురూపమే. ప్రేమ, ఒక స్వచ్చత కోసం నాగరికుడు అటవికుల కోసం పోరాడడం, వారి మద్యన ఉన్న మానసిక బంధాలు, ఉద్వేగాలు, వీటి కంటే కూడ పర్యావరణం మీద వారికున్న మమకారం ఒక్కో సారి మనసులను కదిలిస్తుంది, బహుశ ఇక్కడ నచ్చని వారంతా ముందే లోపల ఒక " ఫిక్సుడ్ " అభిప్రాయం తో వెల్లారనుకుంటా అందుకే మీ అభిప్రాయాలనుకునంగాను..కనీస వాటికి దగ్గరగాను లేకపోవడం తో మీకు నచ్చలేదేమో గాని, నేను మాత్రం ఎటువంటి మీరనుకుంటున్న ఒక " ఫిక్సడ్ " అభిప్రాయం పెట్టుకోకపోవడం వలన, ఒక శూన్యమైన బుర్రతో వెల్లడం వలనేమో నాకు బాగా నచ్చింది...అది కాక దర్శకుడు తీసుకున్న ఇతివృత్తం, కథావస్తువు, కథనం వీటికి ఎంతవరకు న్యాయం చేసాడు అని మాత్రం ఆలోచిస్తే నాకు మాత్రం తప్పకుండా ఇదోక అద్భుత కళాఖండమే. ఇక సాంకేతిక పరంగా చెప్పుకుంటే మనం అంటే భారతీయ సినిమా మరో 100 ఏళ్ళకు కూడ ఈ చిత్రం సాంకేతక స్థాయికి చేరుకోలేమో అని అనిపిస్తుంది.

    ReplyDelete
  10. మీరు చెప్పిన కారణాలవల్ళే నాకూ ఈ సినిమా విసుగు తెప్పించింది. అసలింకా కథ ప్లాట్లో ఉన్న లొసుగుల విశ్లేషణ దాకా పోనే లేదు. స్విస్ ఛీజులో ఉన్నన్ని లొసుగులున్నాయి. కానీ వీటన్నిటితోబాటే ఒక గొప్ప అందం కూడా ఉంది.

    ReplyDelete