Tuesday, December 22, 2009

షిండ్లర్స్ లిస్ట్ - నా అనుభవం


                            నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా  అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా.
కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి  (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా  ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని,  ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.


చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం  హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని  బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని  చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు  ప్రశ్నలు ,  ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది.  ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా  ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
 నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా  haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..
 • పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి  ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
 • అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు  విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు.  ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న  ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు.  నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు. 
 • షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే  చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
 • కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి  తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి  సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి  పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ  కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు  కుంటారు జూస్.
 • సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో  అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది  .  చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని  ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
 • ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా  తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల    యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి  ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో    ఫ్యాక్టరీని  పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల  దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ  సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ  కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో  అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
             ఈ మారణహోమం (holocast) విన్న ఎవరికయినా గుండె రగిలిపోతుంది. అందులో స్పీల్బర్గ్ దర్శకుడు, అందునా జూ.ఇంకెంత రగిలిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆ బాధ ప్రతీ ప్రేక్షకుడికి గుండెలో పలికించ గలగడం, ప్రతీ మనిషిని ఒక ఘడియ ఆపి ఆలోచింప చెయ్యడం, ఒక కన్నీటి బొట్టు నివాళిగా రాల్చ గలిగేలా చెయ్యడం లో స్పీల్బర్గ్ కృత కృత్యుడు అయ్యాడని నా నమ్మకం.
P.S. • ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
 • సినిమా అంతా   నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
 • ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు  పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్  హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని  పోరాడే  మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది. 

13 comments:

 1. వాసు గారూ,
  మీరన్నట్టు ఈ సినిమా ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా. నాక్కూడా మీకొచ్చిన సందేహమే వచ్చింది. అప్పట్లో ప్రపంచం అంతా చూస్తూ ఎలా ఊరుకున్నారా అని..సినిమా B&W లో ఎందుకంటే..సినిమా అంతా వయొలెన్స్ కదా.. అందుకే కావాలనే అలా తీశారనిమిత్రుడొకరు చెప్పారు. నిజమో కాదో తెలీదు మరి.
  జర్మనీ లోనే ఉండటం వల్ల నేను Dachau concentration క్యాంపు చూసాను. అక్కడ నుంచున్నప్పుడు.. ఇదే ప్రదేశంలో అంత పెద్ద మారణకాండ జరిగింది అన్న విషయం తలచుకుంటే..నాక్కలిగిన భావన ఇదీ అని చెప్పలేను :(
  ఒక మంచి సినిమా గురించి చాలా చక్కగా పరిచయం చేశారు. అభినందనలు.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. వాసు గారు..
  సినిమా బావుంటుంది.. సినిమ కంటెంట్ గురించి అయితే.. దాంట్లొ చాలా రాజకీయాలు వున్నాయిలెండి :-)


  అయితే పియానిస్ట్ కూడ మీకు నచ్చుతుంది.. (మీరు అల్రేడి చూసేసివుండకపొతే అర్జెంట్ గా చూసెయండి) ..

  బ్లాక్ & వైట్ - డాక్యుమెంటరి ఫీల్ తీసుకురావడం కొసం మరియు ఆ ప్లేస్ , టైం గురించి మంచి ఇడియా రప్పించడం కొసం.. ఇలాంటిది ఎదొ..

  ReplyDelete
 4. meeru #life is beautiful# kooda choodaMDi. naakaitE aa sinimaaki elaa react avaalO eppaTikee arthaM kaadu.

  ReplyDelete
 5. Life is Beautiful is my life time favorite :-)

  Comedy track of Chirunavvuto (Swamy.. keys and Hat episodes) copied from Life is Beautiful

  ReplyDelete
 6. Damn it మంచుపల్లకి, damn బుడుగు :-)

  'పియానిస్ట్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రెండూ నేను సూచిద్దామనుకుంటే మీరా ఛాన్స్ కొట్టేశారు.

  @వాసు:

  యూదుల్ని నాజీలే కాదు, స్టాలిన్ ఆధ్వర్యంలోని సోవియెట్లు కూడా ఊచకోత కోశారు (కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టి మరీ). చెడ్డపేరు మాత్రం హిట్లర్ ఒక్కడే తన్నుకుపోయాడు. అందుకే అంటారు - గెలిచినోడెప్పుడూ మంచోడే అని.

  రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల flight గురించి తాజా జేమ్స్‌బాండ్ Daniel Craig ప్రధాన పాత్రలో పోయినేడాది ఓ మంచి సినిమా వచ్చింది. Schlinder's List అంత గొప్ప సినిమా కాదు కానీ, చూడదగ్గ సినిమా. కుదిరితే చూడండి, దాని పేరు Defiance.

  ReplyDelete
 7. @మధురవాణి - థాంక్స్. ఆ కాలాన్ని ప్రతిబింబించడం కోసం రియలిస్టిక్ గ ఉండడం కోసం బ్లాక్ అండ్ వైట్ లో తీసి ఉండవచ్చు .

  @ మంచు పల్లకీ - సినిమా కంటెంట్ అన్నీ ఫాక్ట్స్ అనే అనుకుంటున్నాను. అక్కడక్కడా ఇంపాక్ట్ కోసం డ్రమటైజ్ చేసినా చరిత్రను వక్రీకరించలేదని నమ్మకం (ఎందుకో తెలియదు).
  పియానిస్ట్ చూసా బావుంది (కానీ నాతో పాటు చూసిన స్నేహితుడికి కొంచం బోర్ కొట్టింది నిడివి వల్ల, స్లోగా ఉండడం వల్ల). రోమన్ పొలాన్స్కీ దర్శకుడని గుర్తు.

  చిరునవ్వుతో లో ఈ అవిడియాలు ఒరిజినల్ కాదేమో అని అనుమానం ఉంది (త్రివిక్రమ్ ఈ విషయం లో ఘనుడు కదా). అది ఈ రోజు తీరింది.

  @ బుడుగు - లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎప్పడ్నించో చూడ్డామనుకుంటున్న సినిమా. ఇంక ఆలస్యం చెయ్యను.

  @ సునీతా- థాంక్స్

  @ అబ్రకదబ్ర - సోవియట్ కూడా వదలలేదా యూదులని. Defiance చూడడానికి ట్రై చేస్తా.

  P.S. (తెలుగులో ఏదో అంటారు దీనిని మర్చిపోయా ) - ఈ రోజు ఉదయం ఇదంతా టైపు చేసాక లాప్ టాప్ రీస్టార్ట్ ఐపాయింది. మళ్ళీ ఇప్పటికి సమయం చిక్కింది.

  ReplyDelete
 8. అంతే కాదు.. సైబీరీయా లాంటి జైల్స్ కి తరలించబడ్డ జర్మన్ సైనికులు సొవియట్ సైనికుల చేతిలొ చిత్రహింసల పాలయ్యారు.. చాలా కొద్దిమందే ఒకటి రెండు సంవత్స్రాలకన్నా ఎక్కువ బ్రతికారు.. అవేమి బయటకు రాలేదు..
  జుస్ తక్కువొళ్ళు ఎమి కాదండీ.. ఎంతమంది దాడులు తట్టుకున్నారొ.. నాజీ , స్టాలిన్, ముస్లిం వగైరా.. ఎంటొ ఎవరికి వాళ్ళంటే ఇస్టం వుండదు.. అమ్రికా లొ మాత్రం వాళ్ళదే హవా.. అందుకే అంటారు అమ్రికా లొ 51 రాస్ట్రాలు అని.. 51వది ఇజ్రాయల్ ..:-)

  హిట్లర్ గెలిచి వుంటే చరిత్ర వేరే రకంగా లిఖించబడి వుండేది. సినిమాలొ సంఘటనలు అన్ని జరిగుండొచ్చు కానీ .. మసాల మాత్రం బాగానే అద్దారు.

  రోమన్ పొలాన్స్కీ నే డైరక్టర్.. మొన్నే అరెస్ట్ చేసారుకదా.. అందుకు పేరు బాగా గుర్తుంది.. :-)

  ReplyDelete
 9. అకారణ ద్వేషాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు. యూదుల మీద అంత ద్వేషాన్ని విచక్షణ మరిచేంతలా ఎలా తలకెక్కించుకున్నారా! అని ఆశ్చర్యంగా తోస్తుంది.

  ReplyDelete
 10. అందరు నాజీ అఫీసర్లు చెడ్డొళ్ళు కాదు.. కానీ పైవాడి అదేశాలు పాటించాలికదా..
  "Judgment at Nuremberg" చూడండి.. ఆ జర్మన్ లాయర్ వాదన విన్నాకా మీరు ఆ నాజీ అఫీసర్స్ కి శిక్ష పడకూడదు అనుకుంటారు.. Good movie..

  ReplyDelete
 11. సగం చూసి ఆపేసిన సినిమా ఇది.. I don't think I have the strength to finish it! :(

  ReplyDelete
 12. పైన సూచించిన ఏ సినిమానూ చూడటం ఇంతవరకు వీలు కాలేదు.

  షిండ్లర్స్ లిస్ట్ చూడాలని అనుకున్నా, ఎదుటే ఫిల్మ్ క్యాసెట్టు కనపడ్డా నేను చూడలేనంత హృదయవిదారకంగా వుంటుందేమోనని ఇంతవరకూ సాహసం చేయలేదు!

  ReplyDelete