మనసు ఊహల రెక్కల సీతాకోక చిలక
తప్పేదో ఒప్పేదో తెలియక
హద్దూ పొద్దూ ఎరుగక
ప్రేమ పూదోటలో విహరించే మాట వినక
బతుకొక హరివిల్లు
ప్రాయమొక విరిజల్లు
అని మురిసి కన్న కలలు
క్షణంలో చెదరెను ఆశల బొమ్మరిల్లు
వదిలిపోయెను వెతల తీపి ఆనవాళ్లు
మిగిలిపోయెను గుండెలో జ్ఞాపాకాల ముళ్ళు
ఐనా
కొన్ని బాధలు మరువకపొతేనే
కొన్ని గాయాలు మానకపోతేనే
బావుంటుందేమో
No comments:
Post a Comment