నేను కూడలి లో జేరక మునుపు రాసుకున్న కవితని మీ మీదకి వదులుతున్నాను. మీ అక్షింతలు వెయ్యండి మరి.
అంబర నీలంబరమున అద్దిన శశాంక శ్వేత వజ్రకాంతులో
కాలమెల్ల వేచి చూచి అలసి సొలసిన చకోరములకు ఊరడింపులో
కలయిక కల ఇక యని విరియని కలువలకు ఓదార్పులో
కవి డెందము స్పందింపజేయు శశి కందర్పుడు సంధించు సుమశరములో
గాన గంధర్వుల గళముల మృదు స్వర మాధురులు నింపు సుధాపాతములో
ప్రేమికుల హృదయాల విరహాగ్ని జ్వాలలు రేపు శృంగార అగ్ని కణములో
ముత్యాల దొంతరలో శ్వేత సుమ మాలికలో మల్లియలో మకరంద మాధురులో
హిమకరములో చర్మచక్షువులు చూడనలవి కాని శ్వేత రాసులో కానీ
ఈ రేయినెల్ల దివము చేసె శశి మయూఖ కాంతులు
ఇది తెలుగు పీపుల్ డాట్ కామ్ లో అప్పుడెప్పుడో ప్రచురితమైంది.
Click here to see this post in telugupeople.com
Intha lovely gaaa chandamamani, vennalani cheppachu ani ippude telusukunna
ReplyDeleteకలయిక కల ఇక యని విరియని కలువలకు ఓదార్పులో....
ReplyDeletesuuuper andi...my fav line.....
శ్రీ...గారి మాటే నాదీనండీ..
ReplyDeleteI am adding more strength to Sri's and murali's comments... with best wishes ......Nutakki
ReplyDelete@ మురళి: నెనర్లు
ReplyDelete@ Rao garu - Thanks for your encouragement.