Sunday, January 3, 2010
కబుర్లు - జనవరి 3, 2010
ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ఈ న్యూ ఇయర్స్ ఈవ్ మనం చేసుకోవడమేంటి అని ఒక్కొక్క సారి అనిపించినా, మిగతావన్నీ (క్యాలెండర్, పుట్టిన రోజు ఆంగ్ల తేదీ ప్రకారం జరుపుకోవడం, కొన్ని అలవాట్లు) ఓన్ చేసుకున్నప్పుడు ఇది మాత్రం వదిలి పెట్టడం ఎందుకని నాకనిపిస్తుంది. ఇలా ఫిక్స్ అయ్యి ప్రతీ యేడూ శక్తి కొలదీ :) బానే జరుపుకుంటున్నాం ఇది కూడా.
ఇక ఈ మధ్య త్రీ ఈడియట్స్ సినిమా చూసాను. అద్భుతంగా ఉంది. మున్నా భాయి, లగే రహో మున్నా భాయి తీసిన రాజ్కుమార్ హిరాణి హైప్ కి తగ్గ (ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువ ) సినిమాని అందించాడు.ఆమిర్ ఖాన్ సినిమా సినిమాకి తనలోని నటనని సాన బెట్టే విబిన్నమయిన పాత్రలు చేస్తూ తనకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తున్నాడు. ఇక సినిమా చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ (Five Point Someone) ఆధారంగా తీసినది. ఆ నవల నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి.నవలని సినిమా లోని ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, కొంత కథ వరకే వాడుకున్నారు. ఆ పైన అంతా రాజ్కుమార్ హిరాణి రచనా పటిమ, దర్శకత్వ ప్రతిభే. భారతీయ విద్య విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోపాలు ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా చెప్పే కథ. ఆ ముగ్గురిలో ఒకడు మిగతా ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసాడు, వారితో పాటు తోటి విద్యర్తులని ఎలా ఆకట్టుకున్నాడో ,వారి కాలేజీ డీన్ ని ఎలా మార్చాడు అన్న విషయాన్ని తనదయిన శైలిలో మంచి కథనం తో, మంచి హాస్యంతో, హృద్యంగా మలిచాడు హిరాణి.
ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి వాళ్ళకిచ్చిన పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు. బోమన్ ఇరానీ ఎప్పటిలాగే చించేసాడు. శంతను మొయిత్రా సంగీతం చక్కగా సమకూర్చాడు. ముఖ్యంగా నాకు "बहती हवा सा था वो ", Give me some Sunshine (ఈ పాట గురించి నీ రాసిన టపా ఇక్కడ చూడచ్చు) చాలా చాలా నచ్చాయి. ఎటొచ్చి(సినిమా టైటిల్స్ లో ) చేతన్ భగత్ క్రెడిట్ మీద జరుగుతున్న గొడవ చూస్తే విదు వినోద్ చోప్రా, అతని తో పాటు హిరాణి కూడా అతి చేసారనిపించింది. ఈ విషయం లో ఇక్కడ చెప్పింది నిజమనిపించింది.
గత వారాంతం Los Angeles కి వెళ్లాం. క్రిస్మస్ వారాంతమేమో జనం జాతర లా ఉన్నారు. ఒక రోజు యూనివర్సల్ స్టూడియోస్ కి , ఇంకొక రోజు డిస్నీ కి వెళ్లాం. మొదటిది బానే పూర్తీ చేసాం కానీ, డిస్నీ మాత్రం సగం కూడా చూడటం కుదరలేదు. విపరీతమయిన జన ప్రవాహం, ఎక్కడ చూసినా పొడవాటి క్యూలూనూ. ఇంకెప్పుడూ వారంతం అందులో ఇలాటి పొడవు వారంతం (long weekend :)) లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. చాలా మంది డిస్నీ వరల్డ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ (రెండు పార్క్లు ఎదురెదురుగా ఉంటాయ్, ఒకే టికెట్ కూడా తీసుకోవచ్చు) రెండూ చూడటానికి రెండు రోజులుండాలి అంటారు కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక్కరోజులో ముగించచ్చు అనిపించింది. కాకపోతే కాస్త పెందరాడే వెళ్ళాలి. వీటిలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఐతే రెండు షోస్ (ఏడింటికి ఒక పార్క్ లో ఎనిమిదింటికి ఒక దాంట్లో అనుకుంటా) , ఇండియానా జోన్స్, స్ప్లాష్ మౌంటైన్, సోరింగ్ ఓవర్ కాలిఫోర్నియా , టవర్ అఫ్ టెర్రర్, స్పేస్ మౌంటైన్ తప్పకుండా చూడాల్సినవి.
ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చూసా టీవీ 9 లో. మీరు సరిగ్గానే విన్నారు టీవీ ౯ లోనే. అరుణ్ సాగర్ గారి "మేల్ కొలుపు" మీద పుస్తక సమీక్ష . నాకు టీవీ ౯ వారు ఇలాటి కార్యక్రమాలు కూడా చేస్తారని తెలియదు. ఇంతకు ముందు ఈ పుస్తకం గురించి పుస్తకం డాట్ నెట్ లో కత్తి మహేష్ గారు రాసినది చూసా. ఈ కార్యక్రమం కూడా చూసాక ఎలాగయినా చదవాలనిపించింది. తనికెళ్ళ భరణి గారు అద్భుతంగా చెప్పారు ఈ పుస్తకం గురించి. హోస్ట్ బద్రి కాకుండా కొంచం పుస్తక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే (అసలు టీవీ ౯ లో ఉంటే ) ఇంకా బావుండేది.
ఈ మధ్య ఒక బ్లాగ్మిత్రుడి పుణ్యమా అని నేను శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి మార్గదర్శి , వడ్లగింజలు చదువుతున్నాను. త్వరలో నా ఆ అనుభూతి (శ్రీపాది వారి కథలు చదవలేం అనుభవించాలి అంతే ) గురించి రాయాలని ఉంది. అన్నట్టు పద్యాలంటే చెవి కోసుకునే వాళ్ళకి , రాయాలని ఉత్సాహ పడేవాళ్ళకి ఆంధ్రామృతం అనే ఒక అద్భుతమయిన బ్లాగ్ నిర్వహిస్తున్నారు మా రామకృష్ణ మాష్టారు. బ్లాగ్లోకంలో ఈయన చిరపరిచితులనుకోండి. పద్యాలంటే ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యి ఉంటే తప్పక చూడాల్సిన బ్లాగ్ ఇది .
Subscribe to:
Post Comments (Atom)
ఏమోనండీ, నాకైతె "త్రీ ఇడియెట్స్" ఏమాత్రం నచ్చలేదు..రివ్యూలు చదివి చాలా ఊహించుకున్నా.ఆమిర్ మీద ఉన్న నమ్మకంతో "దిల్ చాహ్తాహై" లెవల్లో ఉంటుందని అనుకున్నా ..సినిమా అంతా విపరీతమైన డ్రామా.. "All is well" మరీ చిరాకెత్తించింది నాకు :) , ముఖ్యంగా ఆ డెలివరీ" సీన్లో ..మొత్తానికి "సందేశం" ముసుగులో లాక్కొచ్చేసారు సినిమాని అనిపించింది..
ReplyDeleteశ్రీపాద వారి రచనలు చదవాలని చాలా రోజులనుంచి ఎదురుచూస్తున్నా..ఒకవేళ మీరు చదువుతున్నది ఆన్లైన్ అయితే ఆ లింక్ నాతో పంచుకోగలరా?
మర్చేపోయాను..మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDelete@ ఉమా శంకర్ గారు:
ReplyDeleteఔనా. ఏమో మరి నాకే కాదు, ఇప్పటి వరకు నేను ఎవరినడిగినా బావుందనే అన్నారు అందరూ. AMC theatres (కాలిఫోర్నియా లో ) ఇప్పటి వరకు నేను అంత రష్ ఏ హిందీ సినిమాకి చూడలేదు. సినిమా ఆద్యంతం అంత రెస్పాన్స్ కూడా ఏ సినిమాకీ చూడలేదు. పైగా సినిమా ఐపోగానే చప్పట్లు, విజిల్స్ (ఆనందంతోనే) వేసారు.
శ్రీపాద వారి పుస్తకాలు ఇండియా (నవోదయా) నించి తెప్పించుకున్నా. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, వివరాలు ఇస్తాను. ఆన్లయిన్ ఉన్నాయో లేదో తెలియదండీ మరి.
happy new year
ReplyDeleteశ్రీపాద వారి పుస్తకాల గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం.. ఇప్పుడంటే చిన్న చిన్న సంపుటాలు వస్తున్నాయి కానీ, పది పన్నెండేళ్ళ క్రితం వరకూ విశాలాంధ్ర వాళ్ళు శాస్త్రి గారి మొత్తం కథలని మూడు సంపుటాల్లో అందిచారు.. 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' అనే మరో మంచి పుస్తకం ఉంది.. నేను పోగొట్టుకున్న వాటిలో అది ఒకటి.. ఇప్పుడు దొరకడం లేదు :( ..
ReplyDelete'త్రీ ఇడియట్స్' ఇంకా చూడలేదండీ.. అందరూ చూడమనే చెబుతున్నారు..నవల చదివాను..బానే ఉంది.. సినిమా చూడాలి.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..
@ మురళి గారు: నాకు కొత్తపాళీ గారు చెప్తే ఆ విషయం తెలిసింది. నేను నాలుగు సంపుటాలు తెప్పించుకున్నాను - మార్గదర్శి, కలుపుమొక్కలు, వడ్లగింజలు, నిలువు చెంబు. ఇవి గాక పుల్లంపేట జరీచీర అని ఇంకొకటి ఉంది. ఇది వరకు ఉండే విశాలాంధ్ర వారి మూడిటిని ప్రగతి పుబ్లిషర్స్ వారు అయిదు సంపుటాలుగా ముద్రించారు. ఈ అయిదూ విజయవాడ నవోదయ వారి దగ్గర దొరుకుతున్నాయి.
ReplyDeleteనేను హింది సినిమాలు చూడను.. సొ నేను కామెంటలేను..:(( ..తెలుగులొ రీమేక్ చెసినప్పుడు చూస్తా..
ReplyDelete@ మంచుపల్లకీ: "నేను హింది సినిమాలు చూడను.. " ఏంటి ఈ వివక్ష. మీరు హిందీ కి అంట యాంటీ నా ??
ReplyDeleteఅదొ పెద్ద స్టొరి లెండి. :-))
ReplyDeleteనాకు చిన్నప్పటి నించీ కథలంటే చాలా ఇష్టం. చెప్పరూ.. :)
ReplyDeleteపబ్లిక్ గా వద్దులెండి బాబు లేకపొతే నన్ను కె సి అర్ లా చూస్తారు.. చాటింగ్ లొ మాట్లాడుకుందాం..
ReplyDelete