Thursday, January 28, 2010

పరిమళం

1.
రాలినవి విరులు
సవరించుకుంటే తరులు
సెలయేటి ముకురాల తమ కురులు


రాలిన ఆ విరులు
చుంబించి సెలయేటి అలలు
రేపాయి ప్రేమ ఆవిరులు
పొంగాయి మత్తు అత్తరులు


చల్ల గాలి బోయీలు
పండుటాకు పల్లకీలో
మోసుకెళ్ళాయి ఆ అత్తరులు
మురిసిపోయాయి అత్తరులు

2.
చినుకు నేలని తట్టింది
ఆకాశం ముద్దుపెట్టింది
ఆ స్పర్శకి చెమట పట్టింది
ఆ స్వేదం లో ఏమి సుగంధం

3.
శిశిరమంతా నగ్నంగా
నిలుచున్నది దీనంగా
వీధి చివర ఒంటరి చెట్టు
వసంతం వస్తుందని
పచ్చటాకుల కొత్త కోకను తెస్తుందని.
తనకి కొత్త కోక వాసనంటే భలే ఇష్టం.

6 comments:

  1. చివరికి వసంతాన్ని పరిమళింప చేసారా
    పరిమళం గారూ?
    చాలా భావుకత ఉంది మీలో అది తొణికిసలాడి బ్లాగ్లోకాలకు అమృతపు జల్లై ఆనందాన్ని పంచుతోది.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. వాసు గారూ !
    మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    ReplyDelete
  3. వాసు గారు
    వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  4. శిశిరమంతా నగ్నంగా
    నిలుచున్నది దీనంగా
    వీధి చివర ఒంటరి చెట్టు
    వసంతం వస్తుందని
    పచ్చటాకుల కొత్త కోకను తెస్తుందని.
    తనకి కొత్త కోక వాసనంటే భలే ఇష్టం.

    బావుందండి

    ReplyDelete