Tuesday, January 26, 2010

నేను హిందువుని కానీ పిరికివాడిని

నేను హిందువుని. అలా చెప్పుకోడానికే సిగ్గు పడుతూ ఉంటాను, ఎందుకంటే ఈ మధ్య మతమంటే బూతు మాట ఐపోయింది.  


నేను హిందువుని. పరమ దైవ భక్తుడిని. కానీ పిరికి వాడిని. దేవుడిని గాడంగా నమ్ముతాను. నేనుండే ప్రదేశం లో , రాష్టం లో వీలయితే దేశంలో నా దేవుడిని కొలుచు కోడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళ్తాను.ప్రతీ పండగకి గుడికి వెళ్తాను. ఉగాది నించి సంక్రాంతి దాకా ఏది వదిలిపెట్టను. రోజూ పూజ చేస్తాను. గుళ్ళకి విరాళాలు ఇస్తాను. భక్తి కార్యక్రమాలని శ్రద్ధగా వీలైనన్ని చూస్తాను. నాకు బోలెడు భక్తీ. నా దేవుడంటే యనలేని విశ్వాసం. కానీ ఎవడన్నా నా నమ్మకం మీద దెబ్బకొడుతూ పిచ్చి రాతలు రాస్తే మాత్రం చేతికానివడిలా నోరుమూసుకుని కూర్చుంటాను. నా మతం పరమ పవిత్రంగా చూసుకునే గ్రంథాన్ని అవహేళన చేస్తే నేను మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతా. నా సిగ్గుమాలిన తనాన్ని రచయిత భావ స్వేచ్చ అని సరిపెట్టుకుంటాను. సాహిత్య అకాడెమి అవార్డులిచ్చి సత్కరించుకుంటాను. సన్మాన సభలు చేసి ఆకాశానికి ఎత్తేస్తాను.


నేను రోజూ పూజించే దేవతలను నగ్నంగా, అసభ్యకరంగా చిత్రాలు గీస్తే, సెక్యూలరిజం ముసుగు లో నా చేతకాని తనాన్ని దాచుకుంటాను. ఇంకా ఇలాటివి బోలెడు గియ్యాలని ప్రోత్సహిస్తాను. వీలయితే భారత రత్న ఇచ్చి సత్కరించుకుంటా. గుండెలు రగిలిపోయినా ఎవరినీ ప్రతిఘటించను. నా దేవుడిని ఎవడన్నా తూలనాడినా నేను ఎదిరించను. నా రాముడిని ఏ కాలేజీ లో చదివాడని హేళన చేస్తే నేను మౌనంగా బాధ పడ్డానే కానీ ఎవరినన్నా ఎదిరించానా. ఎందుకు? అలా చేస్తే నన్ను మతోన్మాది అంటారని భయం. ఎందుకంటే నా మతం వరకు (కేవలం నా మతం వరకే వర్తిస్తుంది) మతాన్ని కాపాడుకోవడం కేవలం కాపాడుకోవడమే మిగతా వారికి .. కాదు కాదు నా మతం వారికే మతోన్మాదం లాగ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మేధావులు వేల సంవత్సరాల నా మత చరిత్ర అంతా అవపోసన పట్టారు మరి. పుక్కిలించేసారు. వేదాలను ఆమూలాగ్రం చదివి జాతికి ఉపయోగపడే బోలెడు సంపదను చేకూర్చిన మేధావులు, పరమాచార్యులు పామరులని తేల్చేసారు. నా మత గ్రంథాలు పుక్కిట పురాణాలని సెలవిచ్చ్చారు. అయినా నేను ఏం మాట్లాడగలిగాను.
మీడియా లో నా మతాన్ని వెక్కిరిస్తూ, అవహేళన చేస్తూ రాతలు రాసినా, మాట్లాడినా నేను పట్టించుకోను .. కాదు పట్టించుకోనట్టు నటిస్తాను. నోటికొచ్చినట్టు నా మతం గురించి మాట్లాడితే కళ్ళప్పగించి చదువుతాను, గుడ్లప్పగించి చూస్తాను. కానీ నోరువిప్పి మాట్లాడను. అన్యాయమని చెప్పను. రోడ్డు మీద ...ఉహు.. కనీసం నా ఇంటి ముందు కూడా నా నిరసన వ్యక్తం చెయ్యను.
అంతర్జాలం లో నేను నమ్మిన దేవుళ్ళను, పురాణాలను హేళన చేస్తుంటే గుండె చివుక్కుమన్నా, కట్టెలు తెంచుకునే కోపం వచ్చినా, భరించలేని బాధ కలిగినా నేను బయట పడను. స్త్రీ వాదం, సామ్య వాదం, హేతు వాదం పేరుతో నా నోరేక్కడ నోక్కేస్తారో, నన్ను తిరోగమన వాది, ఛాందసవాది అని ఎక్కడ ముద్ర వేస్తారో అని. పురాణాల్లో ఏదో ఒక చిన్న వాక్యం తీసుకుని, వక్రీకరించి నా మత గ్రంథాల నెక్కడ తూలనాడుతారో అని నేను మాట్లాడను. ఆ సందర్భానికి,యుగకాల మాన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అర్థం చేసుకోవాలి, పోనీ అది ఇబ్బందికరమైతే కనీసం ఈ మేధావులు దానిలో ఉన్న మంచిని తీసుకోవచ్చు కదా అని నా మనసు గగ్గోలు పెడుతుంది. అయినా నేను దాన్ని గొంతు నోక్కేస్తాను. ఎందుకంటే నేను దేవుడున్నాడు, ఇవి పుక్కిట పురాణాలు కాదు అని ఆధారాలు చూపలేక కాదు. శ్రీ కృష్ణుడు ఉన్నాడని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా నిర్దారించారు. అంత మాత్రాన నేను వీరితో వాదించ గలిగానా. అయినా అది అనుభావించాలి నమ్మించ లేము.నమ్మించడం నా పనీ కాదు ఉద్దేశ్యం కాదు. నేను నా మతాన్ని కూడా ఎవడి మీదకీ రుద్దట్లేదు. కానీ నా మతాన్ని కించపరిచే అధికారం, నా sensitivities ని దెబ్బతీసే అధికారం వీరికి ఎవరిచ్చారు. ఈ స్వేచ్చ వీరికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించాలని ఉంటుంది. కానీ నాది ఒంటరి గొంతు అయిపోతుందేమో అని భయం.అందుకే మౌనంగా బాధ పడతాను.

కనీసం నా అభ్యంతరం తెలియచేద్దమన్నా భయమే. ఏకాకి నైపోతానేమో అని. అందుకే నిశ్శబ్దంగా బాధ పడతా. ఎవరన్నా ఒక్కడయినా గొంతెత్తి దీన్ని ఖండిస్తాడేమో అని వేచి చూస్తా. రోజూ అలాటి వాడు ఒక్కడైనా ఉంటాడేమో అని వెతుకుతూ ఉంటా . అలాటి వాడు కనపడగానే సంబర పడతా కానీ అది కూడా మౌనంగానే, పబ్లిక్ గా సంతోషం వ్యక్తం చేస్తే so called intellectual society నన్ను ఎక్కడ వెలి వేస్తుందో, నా మీద ఏం ముద్ర వేస్తుందో అని భయం .
కొన్ని దేశాల లో ఐతే వాళ్ల మత విశ్వాసాలని , నమ్మకాలని దాడి చేస్తే ఖండిస్తారు, శిక్షిస్తారు కొందరైతే ఉరి తీస్తారు అని విన్నాను, చదివాను. ఎందుకంటే వారి మతం కాపాడుకోవడం వాళ్ళకి గౌరవం గా భావిస్తారు. మతం మీద దాడి తమ మీద దాడి గా భావిస్తారు. కానీ నా మతం అభిమతం వేరు. ఎవరన్నా దాడి చేస్తే వారిని మేధావులుగా గుర్తిస్తారు ఆకాశానికి ఎత్తేస్తారు, అవార్డులు ఇస్తారు. ఏమన్నా అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటారు. నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే ఇంకోడి మతం మీద నోటి కొచ్చినది రాయడమా,చేతికోచ్చినది గీయడమా అని ప్రశించాలని ఉంటుంది. కానీ భయం.. కాదు అసమర్థత.


తన వ్యాసం లో ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు (ఎమ్. ఎఫ్ హుస్సేన్ గారి బొమ్మలు నుద్దేశించి) మా దేవుళ్ళ చిత్రాలు ఇలా వేయడం సబబా? కొన్ని కోట్లమంది sensitivities ని దెబ్బకొట్టిన మీకు ముఖం చెల్లడంలేదంటే తప్పా? మా లక్ష్మీ దేవి, సరస్వతి మీ అమ్మపాటి మర్యాదకి నోచుకోలేదా?’అని ఆ సాయిబుగారి ఒక్క వెంట్రుకయినా పీకరేం?....................... ఏం దరిద్రం పట్టింది మన స్వాభిమానానికి? Intellectual hypocrisy is taken for granted as permissiveness to bigotry- in this country. నేను తెలుగు దేశంలో లేనందుకు ఇన్నాళ్ళూ ఆనందించాను. ఇప్పుడిప్పుడు ఇంకా భారత దేశంలో ఉండక తప్పనందుకు విచారిస్తున్నాను." అని వాపోయారు.
నా దేశంలో అన్ని మతాలూ సమానమే. కానీ నాది తప్ప మిగతావి కొంచం ఎక్కువ సమానం. అది అన్యాయం అనిపించినా సరే. నా దేవుళ్ళని, దేవతలని అవమానించి అయినా సరే , నా మతాన్ని పణంగా పెట్టయినా సరే కళాకారుల భావ స్వేచ్చ, సో కాల్డ్ మేధావుల వాక్స్వాతంత్ర్యాన్ని మాత్రం కాపాడాలి. ఇది అన్యాయం అని ప్రతిఘటించే శక్తి ఎప్పుడో కోల్పోయా, నా స్వాభిమానాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టేసా, ఇప్పుడు కేవలం మౌనంగా బాధ పడడమే. అది కూడా తగ్గిపోతోంది. మెల్లాగా వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాను. కొన్నాళ్ళయితే నా మతం కూడా మర్చిపోతానేమో.ఒక్కోసారి అదే మంచిదేమో అనిపిస్తుంది . అప్పుడు ఏ గొడవా ఉండదు. ఈ బాధ, నిస్సాహాయత కూడా ఉండవు.
గమనిక  - వ్యాఖ్యలు చేసేటప్పుడు బ్లాగర్లు తమ విజ్ఞ్యత ప్రదర్శించమని  మనవి. విపరీత వ్యాఖ్యలు , అభ్యంతరకరంగా ఉన్నవి ప్రచురించబడవని  మీకు తెలుసనీ, తదనుగుణంగా  వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తున్నాను. 

27 comments:

  1. ఈవేళ్టి రోజున 90శాతం హిందువులం ఇలాగే ఉన్నాం. మనమంతా మన స్తబ్ధతని విడిచి పెట్టే రోజు రావాలి.

    ReplyDelete
  2. తోటరాముడ్ని మించిన జోకులు పేల్చారు. I am thoroughly entertained.

    ఎనలేని విశ్వాసం ఉన్నప్పుడు, నీనమ్మకాన్ని ఎవరు దెబ్బతియ్యగలరు?
    పవిత్రం అని నువ్వు నమ్మినప్పుడు,దాన్నెవడు ప్రశ్నిస్తేమాత్రం ఏం?
    మనస్పూర్తిగా పూజించగలిగినప్పుడు, అవహేళన నీ పూజకు భంగమా?

    ఎందుకీ నాటకాలు??? ఎవరికోసం ఈ నాటకాలు? You don't believe in anything you preach and practice. there is a inherent doubt that is all pervasive.అందుకే ఇన్నిబాధలు. ఇన్ని జోకులు.

    ReplyDelete
  3. బాగానే కొట్టరు మన కుహన లౌకికవాదులని. అలానే మన హిందువులలో వున్న దురాచారాలని, ఉదాహరణకి కుల వ్యవస్థని గురించి కూడా కొంత ఆలోచిస్తే మనలో వున్న ఈ గొడవలు పోయి సమైఖ్యంగా వుంటారు. అప్పుడు ఇలాంటివారి నోర్లు శాస్వతంగా మూతపడతాయి.

    ReplyDelete
  4. I must say, this is one of the BEST POSTS I have seen in recent times in blog world.

    మీరు రాసిన ప్రతిమాటా అక్షర సత్యం.. హిందువులందరి హృదయవేదన.. Hats Off to you . I will comment in detail again

    ReplyDelete
  5. ఖచ్చితంగా చెప్పారు. పిరికితనం విడనాడితేనే ఎప్పుడైనా, ఏ జాతికైనా విముక్తి!

    ReplyDelete
  6. ఇంచుమించు ప్రతీ హిందువు మనసూ ఇలాగే ఉంటుందేమో .చాలా బాగా చెప్పారు .విదేశాలలో చెప్పులమీదా ,డ్రస్ లమీదా మన దేవతామూర్తుల చిత్రాలు వేసి తయారుచేస్తున్నారంటున్నారు. వాళ్లకా హక్కు ఎవరిచ్చారు .మనదేశమన్నా,మన దేవుళ్ళన్నా వాళ్లకంత లోకువా?

    ReplyDelete
  7. మీరు రాసిన ఈ అక్షరాలు నా కళ్ళ తో చదువుతుంటే వీపు పై చేర్న కోలాతో అచ్చవుతున్నాయి...

    అభినందనలు.

    ReplyDelete
  8. em cheppmantaru.idi ee roju jarguthunna vidhvamsama kadu.charithralo hindutvam pina enni veela smavathsaralanuncho jarguthunna daadi.anni tattukuni inka managalguthondi ante danikunna visistatha alantidi.

    ReplyDelete
  9. మహేష్

    నాదో చిన్న డౌటు ..

    X అనబడే ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనికి అతని తల్లిదండ్రులంటే ఎనలేని గౌరవం, ప్రేమ. కానీ కొంతమంది వ్యక్తులు అతని తల్లి గురించి చెడుగా మాట్లడుతున్నారు. అతనికి తెలుసు తన తల్లి గురించి వాల్లు చెప్పేవన్నీ గాలి కబుర్లని. అయినా సరే, అతని ఎదురుగా అతని తల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అతను తట్టుకోగలడా? అలా వుండగలిగితేనే అంతను గొప్పవాడా? నీకెందుకు నీ తల్లి గురించి నీకు తెలుసు, ఆమె పట్ల నీకు ఎనలేని గౌరవము వుంది, విస్వాసముంది అలాంటప్పుడు అతను నీ ముందు అలా అవకులూ చెవాకులూ వాగితే మాత్రం నీకేమి అని అనగలమా?

    ReplyDelete
  10. సామాన్య పౌరుడికి ఇవన్ని మనకెందుకు అని తప్పుకు తిరుగుతున్నంతవరకు, మనకున్న పీఠాధిపతులు హాయిగా నేతి గారెలు భోంచేస్తూ, ఆశ్రమాల్లో సుఖ జీవితం జరుపుతున్నన్నాళ్ళూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హిందువులకు నాయకత్వం ఏది. రాజకీయ నాయకత్వం లేదు, మత నాయకులు అసలు లేనేలేరు. మరింతకంటే ఏమౌతుంది.హిందువులకు శత్రువులు వేరే మతం వారు కాదు. హిందువులని చెప్పుకుంటూ రక రకాల ఇజాలను భుజానికెత్తుకుని మోసేవాళ్ళే.వీళ్ళు మేధావులుగా చెలామణి అవుతున్నారు ప్రస్తుతం

    ReplyDelete
  11. jaatiki teevrajadatvam vachchimdi .amduke sparsaledu .dIniki sastrachikitsacheaalsinarojulochchaayi . meeru amduku mumduku nadavaali.

    naakardhamkaalaa okavishayam ! neeku nammakamumte evaremanukumte mani annaaru okaayana

    neeku gouravam umdikadaa mee tallidamdrini verokadu neechamgaa toolanaadite ilaane cheppagalavaa ani prasnimchamdi .

    ReplyDelete
  12. ఆకాశరామన్న గారు.. అది డిపెండ్స్.. హిందువయితే చచ్చినట్టు తట్టుకొవాలి... వెరే అయితే తలకి వెలకట్టి ఫత్వా విదించినా అది కరక్ట్..
    ఒకవేళ మనకి అది బాధకలిగించింది అని ఎవరయినా వ్యక్తపరిస్తే మన తల్లిప్రేమనే అనుమాంచే శాడిస్టులు బాగా ఎంజాయ్ చెస్తారు..

    ReplyDelete
  13. @ మహేష్ : ఓహ్ మిమ్మల్ని అంత నవ్వించానా. ధన్యుడిని. ఇంకొకళ్ళ బాధ చూసి జాలి పడడం మానవత్వం , మరి ఆనంద పడడాన్ని ఏమంటారో మీరే చెప్పాలి.

    "ఎందుకీ నాటకాలు??? ఎవరికోసం ఈ నాటకాలు?"
    అదే నాకూ అర్థం కాదు. ఎందుకని కొంత మంది హిందువులు తమ మతం మీద దాడి జరిగితే ఖండించరు సరి కదా దాన్ని ప్రోత్సహిస్తారు. ఈ సూడో హిందూఇజం ఏంటో. పోనీ నాకు మతం అంటే అసహ్యం, అది గజ్జి అని అనుకునేవారు హిందువులని చెప్పుకోవడం ఆత్మ వంచన కాదా.

    "You don't believe in anything you preach and practice. "
    And What did I/we preach and practice and didn't believe? Could you enlighten me on this?

    "There is a inherent doubt that is all pervasive.అందుకే ఇన్నిబాధలు. ఇన్ని జోకులు"

    Yes there is a doubt but not about what we believe. But its this - Why are we so tolerant to this injustice, why are we so patient when our religion is attacked, why don't we react when our sentiments are hurt. Thats the doubt thats all-pervasive among us.

    నా టపా లో మీకు అన్నీ జోకులులా కనపడ్డాయి. మిమ్మల్ని తెగ నవ్వించింది అన్నమాట. మీ ఈ వ్యాఖ్యతో నేను టపా లో చెప్పిన దానిని బలపరిచారు. మీ insensitivity ని కనబరిచారు.

    ReplyDelete
  14. Mahesh with this comment, you lost my respect completely.

    ReplyDelete
  15. @ మందాకినీ - ఆ రోజు రావాలని ఆశిద్దాం.

    @ ఆకాశ రామన్న - దాడి చేసే వాళ్ళ నోరు మూతల పడడం కంటే ముందు బాధ పడేవాళ్ళు నోరు తెరవడం ముఖ్యం. ఇప్పటి సమాజానికి సరి పడని విషయాలు మన ధర్మం లో ఉంటే వాటిని పక్కన పెట్టి మంచిని గ్రహించడం ఉత్తమం. అంతే కానీ వాటిని చూపెట్టి మీ ధర్మమే తప్పు అన్న వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు/మనకి లేదు. నా/మన ఉద్దేశ్యం అది కాదు. కానీ నేను/ మనం గౌరవించే , ఆరాధించే వాళ్ళని/వాటిని తూలనాడితే మౌనం వహించడం చేతకాని తనమనే నా బాధ.

    @ మంచుపల్లకి : నెనర్లు

    @ తమిళన్ : నెనర్లు

    @ రాధిక : విదేశీయుల వరకూ ఎందుకు. మనది మనకే లోకువ.

    @ స్వాతి మాధవ్ : నిజమే

    @ శివ గారు : అందరూ కాకపోయినా కనీసం బాధ పడిన వాడయినా తన గొంతు వినిపిస్తే, తన నిరసన తెలియజేస్తే బావుంటుంది. మౌనంగా బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు. ఇక నాయకత్వమంటారా కొంత మంది (అరుదు కానీ )నిఖాసైన నాయకులు ఉన్నా వాళ్ళకీ మన కుండే ఇబ్బందులేనేమో అనిపిస్తుంది నాకు.

    ReplyDelete
  16. దొంగ లౌకికవాదులకు జోగ్గా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదులెండి. హైందవంపై వీళ్ళకున్న కసిని వెళ్ళగక్కడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు వీరు. రెండు మూడు నాలుకలతో మాట్టాడ్డం దొంగ లౌకికవాదులకు కొట్టినపిండి! అదేదో దేశంలో ఒకడెవడో, ప్రవక్త పైన కార్టూన్లేస్తే ఇక్కడ గొడవలయ్యాయి. అప్పుడు 'నీ మతంపై నీకు నమ్మకం ఉంటే, నీనమ్మకాన్ని ఏ కార్టూన్లు దెబ్బతియ్యగలవు? పవిత్రం అని నువ్వు నమ్మినప్పుడు, దాన్ని గేలి చేస్తే మాత్రం బాధెందుకు నీకు? అలాంటి అవహేళనలు నీ నమాజుకు భంగమా?' అని ఏ లౌకికవాదీ అడగలేదు. ఎంచేతంటే వీళ్ళంతా దొంగ లౌకికవాదులు, కేవల హిందూ వ్యతిరేకులు. ఎంచేతంటే, అలా ప్రశ్నించే ఉంటే ఈదేశంలో ఒక్ఖ లౌకికవాదీ మిగిలేవాడు కాదు. దొంగ లౌకికవాదులూ.. ఎందుకీ నాటకాలు??? ఏ మతం కోసమీ నాటకాలు?

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  18. అకాడెమీ బహుమతి మరోసారి తన విలువని కోల్పోయింది.. నవల చదివిన పాఠకుడిగా నా అభిప్రాయం ఇది..

    ReplyDelete
  19. కత్తిగారు ..మీకు తెలిసిన ముస్లిం మతం / క్రిస్టియన్ మతం వాళ్ళ జొకులేమయినా వుంటే మాకు చెప్పచ్చుగా

    ReplyDelete
  20. వందేమాతర గీతం మేము ఆలపించము అని ముస్లిములు ఎదురు తిరిగినప్పుడు లౌకిక వాదులు ఎక్కడ పాలు తాగుతున్నారు. అని నాకు అడగాలనిపించింది. పాపం లౌకిక వాదులు అందరూ కలిసి తస్లీమా నస్రీన్ మీద జరిగిన దాడిని ఖండించి ఆమె మీద దడి చేసిన వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ ఎందుకు చేయలేదో ....నాకు అడగాలని ఉంది

    ReplyDelete
  21. @Mahesh
    >>ఎనలేని విశ్వాసం ఉన్నప్పుడు, నీనమ్మకాన్ని ఎవరు దెబ్బతియ్యగలరు?
    >>పవిత్రం అని నువ్వు నమ్మినప్పుడు,దాన్నెవడు ప్రశ్నిస్తేమాత్రం ఏం?
    >>మనస్పూర్తిగా పూజించగలిగినప్పుడు, అవహేళన నీ పూజకు భంగమా?
    "ఇవే ప్రశ్నలు గొడ్డుమాంసం టపాలు వ్రాసేటప్పుడు మిమ్మల్ని మీరు వేసుకునుండాల్సింది" - అని నేను అడగను ఎందుకంటే మళ్ళీ అది వేరు, ఇది కాండం అనే మీ విచిత్రమైన (రెండు నాలుకల) వాదన వినే ఓపిక లేదు. ఏదేమైనా ప్రతీదాన్లోనూ హాస్యాన్ని చూడగలుగుతున్న మీ సెన్సాఫ్ హ్యూమర్ కు జోహారులు.

    ReplyDelete
  22. ఇక్కడ మీరు మానతావాదమని చెప్పె అమానవ వాదులను వదిలే శారు. దానితో పాటు గా ఈ మధ్య కాలం లో బుద్దుడి/బౌద్దమతం చాలా మంచిది అని కొంతమంది రాయటం మొదలు పెట్టారు. హిందువులు బౌద్దులను హింసించారు లేక పోతె వారు చాలా మంచి వారు, అహింసకు ప్రతి రూపాలు అనే అర్థం వచ్చే విధం గా వ్యాసాలు రాస్తూ హిందువులను పరోక్షంగ తిట్టటము. రాసే వారికే తెలియదు బౌద్దం అంటె. ఇక బ్లాగు లోకానికి వస్తె కొన్ని విజయాలు ఉన్నాయి. గత సంవత్సరం నా ప్రపంచం అనే బ్లాగు మూతపడటం. అక్కడ హిందూ వ్యతిరేక వ్యాపారాన్ని విజయ వంతం గా మూయించటం జరిగింది. అక్కడ వారు సైన్స్ ముసుగు లో హిందూ ల మీద దాడి చేయటం మొదలు పెట్టారు. జేంస్ రాండీ అనే ఒక నాస్తిక వాది ఆయనా ఒక మిలియన్ డలర్ల సావాలును పదే పదే గొప్పా చెప్పే సదరు బ్లగు యజమానికి నేను జేంస్ రాండి అసలు స్వరూపం గురించి ఆయన వేసిన చాలేంజ్ లో ఉన్న డొల్ల తనం గురించి ఆక్స్ఫర్డ్ శాస్ర వెత్త రూపేర్ట్ షెల్డ్రకె అభిప్రాయాలు చేప్పటం జరిగింది. సదరు బ్లాగు యజమాని పరిస్థి నెల్లురు పెద్దారెడ్డి కామేడి ట్రాక్ లో బ్రమ్హానందం ఆఖరి సీను లో నోరు మెదపలేని పరిస్థితి. మన కత్తి గారి తో బ్లాగులు సైన్స్ పరిశొధనా పత్రాలు చర్చించుకునేదుకు కాదు రాసేది అని చెప్పించ్చాడు. క్లుప్తం గా చేప్పాలి అంటె జెంస్ రాండి గాడు మన కె.ఎ. పాల్ లాంటి వాడు అని రూపెర్ట్ అన్నాడు. ఇటువంటి కమేడియన్ మనవతా వాది అని పిలిపించుకొనే ఇన్నయ గొప్ప గా రాయటం. మేము దాదాపు రెండు నేలలు ఆయాన సమాధానాల కోసం వేంకట రమణ, మలక్ ప్రయతిన్స్తె ముఖం చాటెసి బ్లాగు మూసెశాడు.
    http://www.sheldrake.org/D&C/controversies/randi.html

    James Randi - a Conjurer Attempts to Debunk Research on Animals

    The January 2000 issue of Dog World magazine included an article on a possible sixth sense in dogs, which discussed some of my research. In this article Randi was quoted as saying that in relation to canine ESP, "We at the JREF [James Randi Educational Foundation] have tested these claims. They fail." No details were given of these tests.

    I emailed James Randi to ask for details of this JREF research. He did not reply. He ignored a second request for information too.

    I then asked members of the JREF Scientific Advisory Board to help me find out more about this claim. They did indeed help by advising Randi to reply. In an email sent on Februaury 6, 2000 he told me that the tests he referred to were not done at the JREF, but took place "years ago" and were "informal". They involved two dogs belonging to a friend of his that he observed over a two-week period. All records had been lost. He wrote: "I overstated my case for doubting the reality of dog ESP based on the small amount of data I obtained. It was rash and improper of me to do so."

    Randi also claimed to have debunked one of my experiments with the dog Jaytee, a part of which was shown on television. Jaytee went to the window to wait for his owner when she set off to come home, but did not do so before she set off. In Dog World, Randi stated: "Viewing the entire tape, we see that the dog responded to every car that drove by, and to every person who walked by." This is simply not true, and Randi now admits that he has never seen the tape.

    ReplyDelete
  23. Bhaarata desam lo anni mathaala kante chulakana aipoyina matham manadi. Secularism perutho Hindutvanni champestunnaru. Ee blog chaduvuthu unte Naa manasu lo unna matalani nuvvu aksharalu ga maarchavemo anipinchindi. nee gonthu ontaridi kaadu. Ee vishayam ga emaina cheddamu ante naa gonthu thappaka nee gonthu ki thodavuthundi. naku telisina chala gonthulu thodavuthayi. Kani, enduko modati adugu veyyatanikey manam chala jankuthunnamemo! Eppudaina ee vishayam manam charchiddam.. mana vanthu emaina cheyyagalamemo!

    ReplyDelete
  24. హిందుత్వం చాల ప్రాచినమైనది ,చులకనం భావం ఎందుకో అర్దంకాదు . సనాతన ధర్మం లోని విలువలు ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో ?
    ఇది గమనించార మన యోగులు నేర్పించిన యోగ పద్దతులు బానే అవపోసంపటేరు . కానీ మన ధర్మాల్ని ఎందుకో మూలకి నేట్టేస్తునారు.
    మంచి నడవడిని, సంస్కారం ని మించిని జీవితం కన్నా ఏది ఎక్కువ
    ఇక గొంతు కలపడమ నావంతు కూడా.

    ReplyDelete
  25. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ఎక్కడో డెన్మార్క్లో కార్టూన్స్ వేస్తే ఇక్కడ గొడవ చేస్తారు, da vinci code సినిమాని ప్రపంచమంతా చూస్తే మన రాష్ట్రం లో మాత్రం నిషేదించారు కాని మన హిందూమతాన్ని కించపరిచే విధంగా పుస్తకం రాస్తే మాత్రం మనం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఇస్తాం.

    కాని లోపం ఎక్కడో లేదు... మనలోనే ఉంది... హిందువులలో ఐకమత్యం లేదు. హిందూమతంలోని లెక్క లేనన్ని కులాలు విభాగాలు దీనికి కారణం. మనలో చాలామంది హిందువు అని చెప్పుకునే కంటే నేను ఫలానా కులం అని చెప్పుకోటానికే ఇష్టపడతారు. కులాన్ని highlight చెయ్యటానికి పేరు పక్కన తోకలొకటి! మనలో మనం కులాల పేరుతో తన్నుకుంటుంటే మరి పక్క మతాలకి మనమంటే చులకన తప్ప ఇంకేంటి? ఈ గొడవలు మన తెలుగు వాళ్ళలో మరీ ఎక్కువ... రాజకీయాల నుండి సినిమావాళ్ళ వరకు...కాలేజీల నుండి ఆఫీసుల వరకు కులాలతో కొట్టుకోవటం తప్ప మనమేం చేస్తున్నాం? ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టటం, వాళ్ళ వాళ్ళతోనే స్నేహం చేయటం! ఉదాహరణకి మన తెలుగు వాళ్ళ orkut profiles చూస్తే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది. ఎప్పుడూ తమవాళ్ళని పైకి తెచ్చే ప్రయత్నమే తప్ప మన మతం ఐక్యత గురించి ఆలోచించే వాళ్ళే లేరు. పైగా అప్పుడప్పుడు ఇలా హిందూమతాని ఎవరో ఏదో అన్నారని భాధ పడటం ఒకటి! ఒక కులం వాళ్ళు వేరే కులం గురించి నీచంగా మాట్లాడతారు! ఒకరేమో వాళ్ళేదో దేవుడి సంతానమని ఫీల్ అవ్వటం! ఎందుకిలా అంటే మన సౌలభ్యం కోసం దేవుడే ఇలా విభజనలు చేసాడని ఒక వితండవాదం చెయ్యటం. మనలోనే మనమే ఇలా తేడాలు చూపిస్తుంటే హిందూమతమంటే అందరికి చులకన అవ్వక ఇంకేమవుతుంది? నా కులం గొప్ప అంటే వేరొక కులం గొప్పకాదనే అర్ధం!
    Divide & Rule ద్వారా మనదేశాన్ని విచ్చిన్నం చేసారని బ్రిటిష్ వాళ్ళని తిట్టిపోయటం తప్ప మనలో మనమే Devide & Live ఆచరిస్తున్నమన్న విషయం పట్టదు. రొజూ నేను పూజించే ఆ ఏడుకొండలవాడిని కరుణానిధి అసలు లేడని చెప్పినప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం, కాని అలాంటి వాళ్ళు ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారంటే మనలోని అనైక్యత ఇచ్చిన ధైర్యమే! ఎప్పుడైతే హిందువులలో అసమానత్వం పోతుందో అప్పటివరకు ఇలా భాదపడుతూ కూర్చోడం తప్ప మనం ఏమీ చెయ్యలేం!

    ReplyDelete
  26. కొన్నిసార్లు మంచితనం, చేతకానితనం ఒకేలా కనపడతాయి. మంచితనమో, చేతకనితనమో మనకే తెలియని పరిస్థితి. దాంతో కొందరికి - ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుంది అనే దైర్యం కలుగుతుంది. నాలుగు పిచ్చి గీతలు గీసి, దానికి modern art అని పేరు పెట్టుకుని డబ్బు చేసుకునే వాళ్ళు కూడా వెర్రి వేషాలు వేస్తారు. అలాంటి వాళ్ళకి తోడుగా కుహానా లౌకిక వాదులు ఉండనే ఉన్నారు.

    ReplyDelete
  27. టపా బాగుంది. దాంట్లోని ఆవేదనా అర్థమయింది. ఈ విషయంలో మన ఇరువురి ఆలోచనలు ఒకలాగానే ఉన్నాయి. హిందూ మతం తరపున వకల్తా పుచ్చుకున్న బి.జె.పి రాజకీయంగా హిందువులకి చేసేది శూన్యం. వి.హెచ్.పి లాంటి సంస్థలు ముందుకొచ్చిన వాటి మీద మతోన్మాదులని ముద్ర. మనం కూడా నవ్వి ఊరుకొంటాము తప్పితే చేయూతనివ్వం.

    ReplyDelete